Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?

Omicron name meaning and why it is named Omicron: సౌత్ ఆఫ్రికాలో కొత్తగా గుర్తించిన కొవిడ్-19 వేరియంట్‌కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదంతా చూస్తోంటే.. చాలా మందికి ఓ సందేహం రాకమానదు. అదేంటంటే.. అసలు ఈ కొత్త కొత్త వేరియంట్స్‌కి ఈ పేర్లు పెట్టేది ఎవరు (Who names new variants) ? ఎలా పెడతారు, ఆ పేర్లే ఎందుకు పెడతారు అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది.

Written by - Pavan | Last Updated : Dec 2, 2021, 04:05 PM IST
  • కొత్త కొత్త వేరియంట్స్‌కి ఈ పేర్లు పెట్టేది ఎవరు ?
  • ఆ పేర్లే పెట్టడానికి కారణం ఏంటి ?
  • Coronavirus new variants కి ఏ భాష ఆధారంగా పేర్లు పెడతారో తెలుసా ?
Omicron meaning: ఒమిక్రాన్ అంటే అర్థం ఏంటి ? New variants కి ఆ పేర్లు ఎలా పెడతారు ?

Omicron name meaning and why it is named Omicron: సౌత్ ఆఫ్రికాలో కొత్తగా గుర్తించిన కొవిడ్-19 వేరియంట్‌కి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. కరోనావైరస్ పుట్టింది మొదలు ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి... పోతూనే ఉన్నాయి. వాటికి కొత్త కొత్త పేర్లతో పిలవడం చూస్తూనే ఉన్నాం. ఇదంతా చూస్తోంటే.. చాలా మందికి ఓ సందేహం రాకమానదు. అదేంటంటే.. అసలు ఈ కొత్త కొత్త వేరియంట్స్‌కి ఈ పేర్లు పెట్టేది ఎవరు (Who names new variants) ? ఎలా పెడతారు, ఆ పేర్లే ఎందుకు పెడతారు అనే సందేహం చాలామందిని వేధిస్తుంటుంది. ఆ వివరాలు ఏంటనేది ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఒమిక్రాన్ అనేది గ్రీకు భాషలో 15వ అక్షరం. మనం ఇంగ్లీషులో రాసినట్టే పెద్ద " O " అనేది పెద్ద అక్షరం కాగా '' o " అనేది చిన్న ఓ అక్షరానికి చిహ్నంగా ఉంటుంది. డిక్షనరి సూచిస్తున్న అర్థం ప్రకారం ఒమిక్రాన్ అంటే గ్రీకు భాషలో '' చిన్న ఓ '' అనే అర్థం (Omicron meaning) వస్తుందట. 

Also read : National Pollution Control Day 2021: జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా ?

కరోనావైరస్ కొత్త వేరియంట్స్‌కి గ్రీకు భాష ఆధారంగా పేర్లు పెట్టనున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది మే నెలలోనే ప్రకటించింది. కొన్ని రకాల కొత్త వేరియంట్స్‌కి అవి తొలిసారి గుర్తించిన దేశాన్నిబట్టి పేరు పెట్టినప్పటికీ.. ఇది సరైన పద్ధతి కాదనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయం. అందుకే సైన్స్ గురించి పెద్దగా తెలియని వారికి కూడా అర్థమయ్యే భాషలో ఉండాలనే ఉద్దేశంతోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రీకు అక్షరాలను (Why was it named Omicron) ఎంచుకుంది.

ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఏం చెబుతోందంటే.. ఏ దేశంలోనైతే కొత్త వేరియంట్ పుట్టిందో.. ఆ దేశం పేరుతో వైరస్‌కి పేరు పెట్టి పిలవడం కారణంగా ఆ దేశాన్ని ఇతర దేశాలు వివక్షతతో చూసే ప్రమాదం ఉంది. ఇక సైంటిఫిక్ భాషలో కొత్త వేరియంట్‌కి పేరు పెడితే.. ఆ పేరును పిలవడం, గుర్తుంచుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అందుకే గ్రీకు భాష అక్షరాలను ఎంచుకున్నట్టు గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization about Coronavirus) పేర్కొంది.

Also read : What happens if you see snakes in your dreams : కలలో పాములు, చితి కన్పిస్తున్నాయా..ఆ కలలకు అర్ధం ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News