Talasani Srinivas Yadav : `రాజ్ కహాని` కోసం మంత్రి తలసాని.. చాలా రోజులకు కనిపించిన వైవీఎస్ చౌదరి
Talasani Srinivas Yadav for Raj Kahani తెలంగాణ సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్న సినిమాల ప్రమోషన్స్‌లో ముందుంటాడు. మంత్రి తలసాని సినిమా ఈవెంట్లకు వచ్చి కొత్త వారిని ప్రోత్సహిస్తుంటాడు.
Talasani Srinivas Yadav for Raj Kahani తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్న సినిమాల కోసం ఎప్పుడూ తన టైంను కేటాయిస్తుంటాడు. తాజాగా రాజ్ కహానీ అనే సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం యువ హీరోలు తమ తమ కథలు తామే రాసుకుంటూ దర్శకత్వం చేసుకుంటున్నారు. తమ కథల్లో తామే హీరోలుగా నటిస్తున్నారు.
రాజ్ కహానీ అంటూ.. రాజ్ కార్తికేయన్ హీరోగా, దర్శకుడిగానూ తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు. రాజ్ కహానీ అనే ఈ సినిమాను భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రాన్ని మార్చి 24న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు వైవీఎస్ చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిథులుగా వచ్చారు. ట్రైలర్ బాగుందని చెబుతూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ట్రైలర్ చూస్తే కామెడీ, ఎమోషన్ సమపాళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ట్రైలర్‌లో ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. రాజ్ కహాని సినిమాతో మంచి సందేశాన్ని ఇవ్వబోతోన్నట్టుగా ట్రైలర్ చెబుతోంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం ప్లస్ అవుతుంది. ఈ సినిమాను మార్చి 24న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
Also Read: Kota Srinivasa Rao : చనిపోయానంటూ వార్తలు.. పోలీసులు వచ్చారు.. కోట శ్రీనివాసరావు వీడియో వైరల్
Also Read: Nani With Anchor Suma: ప్రోమోల కోసం నాని కూడా ఇలా చేస్తున్నాడా?.. అవాక్కైన యాంకర్ సుమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook