Tamannaah Bhatia Marriage : టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగానే ఉంటోంది. తమన్నాకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. చివరగా ఎఫ్ 3 సినిమాతో పలకరించింది. అందులో తమన్నా వేసిన గెటప్, పాత్ర మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది. పైగా ఈ సినిమా షూటింగ్ దశలో చిత్రయూనిట్‌తో ఆమెకు గొడవలు జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. అందుకే తమన్నా ప్రమోషన్స్‌కు దూరంగా ఉందంటూ కథనాలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమన్నాతో జరిగిన గొడవ మీద అనిల్ రావిపూడి కూడా స్పందించాడు. ఎక్కువ సేపు షూటింగ్ చేయమని అడిగితే రానని చెప్పడం, ఉదయం, సాయంత్రం కాసేపు ఉండమని అడిగే ఉండకపోవడం. జిమ్‌కు టైం అవుతుందని వెళ్లింది.. అది చిన్న మ్యాటర్ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. కానీ తమన్నా వల్లే.. పూజా హెగ్డేతో ఓ స్పెషల్ సాంగ్ చేయాల్సి వచ్చిందంటూ కథనాలు వచ్చాయి. మొత్తానికి తమన్నా మీద రకరకాల కథనాలు వచ్చేశాయి.


తమన్నా విలన్‌గా నటించిన నితిన్ మేస్ట్రో సినిమా బాగానే వర్కౌట్ అయింది.కానీ అది కేవలం ఓటీటీలోనే వచ్చింది. అలా నెగెటివ్ పాత్రలో తమన్నాను చూసి అంతా ఫిదా అయ్యారు. తమన్నాకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు లేకపోయినా బాలీవుడ్లో మాత్రం మంచి ఆఫర్లున్నాయి. బబ్లీ బౌన్సర్ అంటూ ఈ మధ్యే ఓటీటీలో పలకరించింది. బౌన్సర్‌గా తమన్నా చక్కగా నటించింది. కానీ సినిమా మాత్రం అందరినీ ఆకట్టుకోలేకపోయింది.


తమన్నా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్‌ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రతీ ఇండియన్ పేరెంట్‌లానే తన తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారని, తాను పెళ్లి చేసుకుని సెటిల్ అయితే చూడాలని అనుకుంటున్నారని తన తల్లిదండ్రుల గురించి చెప్పింది. ఇప్పుడు మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే కూడా మా అమ్మ ఫోన్ చేస్తుంది.. పెళ్లి గురించి అడుగుతూ ఉంటుంది.. అది విని విని చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది అని తమన్నా తెలిపింది.


అయితే తనకు కూడా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనాలని ఉందంటూ తన కోరికలను బయటపెట్టేసింది. కానీ ఇప్పుడు తనకు మాత్రం అంత టైం ఉండటం లేదని, రోజుకు 26 గంటలు పని చేస్తున్నాను అంటూ కాస్త ఎక్కువే చెప్పేసింది తమన్నా. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించేంత లేదని, తన సినిమాలతోనే బిజీగా ఉన్నానని, అదే తనకు కంఫర్ట్ జోన్ అని తమన్నా చెప్పుకొచ్చింది.


Also Read : Ananya panday Pics : అనన్య అందాల విందు


Also Read : Shilpa Shetty - Anushka Shetty : 'కాంతారా'కు శెట్టిల సపోర్ట్.. శిల్పా శెట్టి, అనుష్క


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook