Tamannaah Bhatia Beauty Secret: తమన్నా భాటియా గురించి తెలుగు వారందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.  ఎందుకంటే తెలుగులో శ్రీ అనే సినిమాతో మంచు మనోజ్ సరసన హీరోయిన్గా పరిచయమైన ఆమె అనతి కాలంలోనే తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించింది. హ్యాపీ డేస్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న ఈ భామ తరువాత తెలుగులో రెడీ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, బద్రీనాథ్, ఊసరవెల్లి, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు ఇలా వరుస సినిమాలతో సూపర్ క్రేజ్ దక్కించుకుని తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆమె మిల్కీ బ్యూటీ అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఆమె అంత అందంగా ఉండడానికి ఆమె ముఖానికి పొద్దున్నే ఏమి రాస్తుందో తెలిస్తే మీరు బిత్తర పోతారు. ఎందుకంటే నిజానికి చాలా మందికి అనేక రకాల కారణాలతో ముఖం మీద మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. వాటిని దక్కించుకునేందుకు ఎన్నో రకాల సబ్బులు వాడుతూ, రకరకాల క్రీములు వాడుతూ లక్షల కొద్ది డబ్బులు కూడా తగలబెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫారెన్  నుంచి కాస్మొటిక్స్ తెప్పించుకుంటే మరికొంతమంది పల్లె ప్రాంతాలకు వెళ్లి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు.


ఇదీ చదవండి: Samantha vs Naga Chaitanya: పాపం నాగచైతన్య కలెక్షన్స్ టచ్ చేయలేకపోయిన సమంత?


అయితే తమన్నా మాత్రం ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా తన ముఖాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకునేందుకు తన ఉమ్మిని వాడుతుందట. ఈ విషయాన్ని కొద్ది నెలల క్రితం తమన్నా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమెను చాలాసేపు స్కిన్ కేర్ రొటీన్ గురించి అడిగితే తాను ఉదయాన్నే లేవగానే మార్నింగ్ సలైవాను తన ముఖానికి రుద్దుకుంటానని చెప్పుకొచ్చింది. అంటే తన నోటి నుంచి వచ్చే ఉమ్మిని తీసి ముఖం మొత్తం రుద్దుకుంటుందట.


కొద్దిసేపు అది ఎండనిచ్చిన తర్వాత సాఫ్ట్ సోప్ తో దాన్ని కడిగి వేస్తానని ఆమె చెప్పకు వచ్చింది. వినడానికి షాకింగ్ గా అనిపిస్తున్నా ఈ ఉదయాన్నే వచ్చే ఉమ్మి వల్ల నిజంగానే మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఉమ్మిని ముఖానికి  రుద్దుకోవడం అనేది వినడానికే కాస్త వింతగా ఉన్నా, అది నిజంగానే పనిచేస్తుందని, ఉమ్మిలో ఒక రకమైన ప్రోటీన్ ఈ మొటిమలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.


అయితే ఇది అందరికీ పని చేయదని కొన్ని రకాలైన స్కిన్స్ ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి చర్మ డాక్టర్ ని సంప్రదించి ఆయన సూచనల మేరకు ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయని స్వయంగా గూగుల్ చేసి ముఖానికి రుద్దుకుంటే అనవసరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముఖం ముఖానికి ఉమ్మి మంచి చేయొచ్చు అలాగే ఇబ్బంది పెట్టొచ్చు కాబట్టి ఒకసారి మీకు ఇలాంటి ఇబ్బంది ఎదురైతే డాక్టర్ ని సంప్రదించండి. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ఆమె భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది. 


ఇదీ చదవండి: Samantha vs Lawrence: పని చేయని సమంత మ్యాజిక్.. ఆ ఏరియాల్లో రచ్చ రేపిన లారెన్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook