Tamil Ace comedian Vadivelu tested positive for Covid-19: తమిళ స్టార్ కమెడియన్‌, వైగై పుయల్ వడివేలు (Vadivelu) కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారు. మూడు రోజుల క్రితం లండన్‌ నుంచి తిరిగొచ్చిన వడివేలు.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని పోరూరు సమీపంలో ఉన్న శ్రీరామచంద్ర మెడికల్‌ హాస్పిటల్‌ (Sri Ramachandra Medical Center)లో చేర్పించారు. అక్కడ ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ (Covid 19 Positive) అని తేలింది. ప్రస్తుతం వడివేలు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. వడివేలు లండన్‌ నుంచి రావడంతో ఒమిక్రాన్‌ (Omicron) నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈరోజు రిపోర్టులు వస్తాయని సమాచారం. ఆయనతో పాటు ఉన్న చిత్ర యూనిట్ ఆందోళనకు గురవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో వడివేలు ఎక్కువగా సినిమాలు చేయలేదు. 'నాయి శేఖ‌ర్ రిట‌ర్స్' అనే సినిమాతో పునరాగమనానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం లొకేష‌న్స్ రీసెర్చ్‌లో భాగంగా డైరెక్ట‌ర్ సురాజ్‌, లైకా ఉమేష్‌ల‌తో క‌లిసి లండ‌న్ వెళ్లి లొకేష‌న్స్ చూసుకుని మూడు రోజుల క్రితం చెన్నై తిరిగి వ‌చ్చారు. రెండు రోజుల అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు పోరూరులోని శ్రీరామచంద్ర మెడికల్‌ హాస్పిటల్‌లో చేర్పించగా.. పాజిటివ్‌ అని తేలింది. లండన్‌లో ఎక్కువగా ఒమిక్రాన్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. శనివారం రిపోర్టులు రానున్నాయి. వడివేలు త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Also Read:RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు 45 కోట్లు వసూలు చేసిన చరణ్.. అలియా భట్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!!


ఇటీవల రామ‌చంద్ర హాస్పిట‌ల్‌లో స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ క‌రోనా కార‌ణంగానే జాయిన్ అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఆయన తాజాగా ఇంటికి తిరిగి వ‌చ్చారు. వడివేలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, యాక్షన్‌ కింగ్‌ అర్జున్, చియాన్ విక్రమ్ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. 


Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వాయిదా పడనుందా?.. అసలు కారణం ఇదే!! 


వడివేలు (Vadivelu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త‌మిళంలో ఒకానొక ద‌శ‌లో స్టార్ క‌మెడియ‌న్‌గా వెలుగొందారు. హీరోల‌కు ఉన్నంత క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రేమికుడు, మిస్టర్‌ రోమియో, నవ్వండి లవ్వండి,  ప్రేమ దేశం, రక్షకుడు, ఒకే ఒక్కడు,  చంద్రముఖి, ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది లాంటి తదితర డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. స్టార్ డైరెక్టర్లు, నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన సినిమా కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. తాజాగా  'నాయి శేఖ‌ర్ రిట‌ర్స్' (Naai Sekhar Returns) అనే సినిమాతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook