తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్ వడివేల్ బాలాజీ మృతి (Vadivel Balaji Dies with Heart Attack) చెందాడు. గురువారం ఉదయం గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కమెడియన్ తుదిశ్వాస విడిచాడు. గత కొంతకాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. రెండు వారాల కిందట ఆరోగ్యం క్షీణించడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. Actress శ్రావణి అంత్యక్రియలు పూర్తి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసుపత్రి ఖర్చులు భరించలేక వడివేల్ బాలాజిని ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రముఖ హాస్య నటుడు వడివేలును బాగా ఇమిటేట్ చేయడంతో వడివేలు బాలాజీగా పేరు మారిపోయింది. కమెడియన్ మరణం పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వడివేలు బాలాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.   Sanjay Raut: కంగనా రనౌత్ తేల్చుకోవాల్సింది శివసేనతో కాదు 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR