Actress Sravani Funeral: నటి శ్రావణి అంత్యక్రియలు పూర్తి..

వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన బుల్లితెర నటి శ్రావణి అంత్యకియలు (actress Sravani Last Rites) పూర్తయ్యాయి.

Last Updated : Sep 10, 2020, 02:53 PM IST
Actress Sravani Funeral: నటి శ్రావణి అంత్యక్రియలు పూర్తి..

వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన బుల్లితెర నటి శ్రావణి అంత్యకియలు (actress Sravani Last Rites) పూర్తయ్యాయి. వారి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలులో బంధువులు, కొందరు సన్నిహితుల ఆశ్రు నయనాల నడుమ శ్రావణి అంత్యకియలు జరిగాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం స్థానిక శ్మశాన వాటికలో శ్రావణికి తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణికి ఆశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు. Actress Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్

మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. వరుసగా ఆడియో టేపులు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఆమెను ప్రేమించిన దేవరాజ్‌ రెడ్డి తనను కలవాలని శ్రావణిని బెదిరించిన ఆడియో లీకైంది. ప్లీజ్ వదిలేయ్ దేవా అంటూ శ్రావణి ప్రాథేయ పడినట్లుగా వినిపించింది.  Sanjay Raut: కంగనా రనౌత్ తేల్చుకోవాల్సింది శివసేనతో కాదు

శ్రావణి, ఆర్‌ఎక్స్ 100 నిర్మాతకు మధ్య జరిగిన సంభాషణ ఆడియో వెలుగు చూసింది. దీంతో తాను కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నానని శ్రావణి చెప్పడం.. అయితే వాడు ఒప్పుకోవడం లేదని, కాల్స్ చేస్తూనే శ్రావణి అనడం ఆడియోలో స్పష్టంగా ఉంది. అయితే శ్రావణి విషయంలో నిర్మాత జోక్యమేంటి, ఇది ఎప్పుడు జరిగింది, దేవరాజ్‌కు, శ్రావణి, నిర్మాతకు మధ్య రిలేషన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎస్సార్ నగర్ పోలీసులు శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్

 

Trending News