కరోనావైరస్ ( Coronavirus ) బాధపడుతూ స్వామి నాథన్ అనే తమిళ చిత్ర నిర్మాత ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనావైరస్ పాజిటివ్ ఉందని తెలిసిన అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. స్వామినాథన్  మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. రెండు దశాబ్ధాలకుపైగా తమిళ పరిశ్రమతో అనుబంధం ఉన్న స్వామినాథన్.. అజిత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, కార్తిక్‌ వంటి తమిళ స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాలు నిర్మించాడు. కే మురళీధరన్, వేణుగోపాల్ వంటి నిర్మాతలతో కలిసి లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ స్థాపించిన స్వామినాథన్.. రెండు దశాబ్ధాలుగా చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నాడు. Also read: Tuck Jagadish: టక్ జగదీష్ మూవీలో నాని పాత్ర ఇదేనా ?


V Swaminathan మృతి పట్ల ఆయన సన్నిహితమిత్రులు సోషల్ మీడియాలో పలు సంతాప సందేశాలు పోస్ట్ చేస్తూ.. మంచి మిత్రుడిని కోల్పోయాం అని ఆవేదన వ్యక్తంచేశారు. Also read: Ram Charan: రాంచరణ్‌కు ఈమధ్య బాగా నచ్చిన సినిమా