Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కు పెరిగింది. అంతేకాదు రాజమౌళితో చేసిన ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ కోవలో ఎన్నో స్టోరీలు విన్న తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కింది. అందులో ఫస్ట్ పార్ట్ దేవర పార్ట్ -1 సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఏ పెద్ద సినిమా రిలీజ్ కావడం లేదు. కానీ తమిళంలో మాత్రం విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘హిట్లర్’ మూవీ విడుదలకాబోతుంది. ఒక రకంగా తన సినిమాతో ఎన్టీఆర్ కు ఛాలెంజ్ చేస్తున్నాడన్న మాట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ సినిమాకు అందరు హీరోలు లైన్ క్లియర్ ఇచ్చినా.. విజయ్ ఆంటోని మాత్రం కంటెంట్ పై నమ్మకంతో బాక్సాఫీస్ పోరుకు సై అంటున్నాడు.  విజయ్ ఆంటోని దక్షిణాది చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన నటనతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈయన సినిమాలు గతంలో మాదిరి తెలుగులో పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ వంటి ఊర మాస్ క్రౌడ్ పుల్లర్ హీరో సినిమాతో పోటీ పడటం అంటే మాములు విషయం కాదంటన్నారు బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు.


చిరంజీవి నటించిన ‘హిట్లర్’ మూవీ టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ ఆంటోని. ధన దర్శకుడు. ఈ సినిమాను కూడా ఈ నెల 27న తమిళం, తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నాడు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


"హిట్లర్" మూవీ ట్రైలర్ విషయానికొస్తే..  ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ను కట్ చేశారు. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. అంతేకాదు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుండటం ఈ సినిమా స్టోరీ. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్ లో చూపించి ఈ సినిమాపై ఓ రకంగా బజ్ క్రియేట్ చేశాడు విజయ్ ఆంటోని.


దేవర సినిమా చూడని ప్రేక్షకులు సెకండ్ ఆప్షన్ గా ఈ సినిమా ఉండనుందని చూపించాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ‘దేవర’ ముందు ఏ మేరకు తెలుగులో నిలబడుతుందో చూడాలి. అసలు ఈ సినిమాను థియేటర్స్ దక్కుతాయా అనేద కూడా డౌటే. మొత్తంగా ఏ ధైర్యంతో విజయ్ ఆంటోని మొండిగా బాక్సాఫీస్  బరిలో దిగుతున్నాడు. మరి ఈ  పోటీలో దేవరతో నెగ్గి బాక్సాఫీస్ విజేతగా నిలుస్తాడా అనేది చూడాలి.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.