Taraka Ratna as Villian: బాలయ్య పక్కన విలన్ గా తారకరత్న.. లుక్ కూడా సెట్ అనుకున్నాక ఇలా!
Taraka Ratna as Villian : ఈ సినిమాలో తారకరత్నను విలన్ గా నటింపజేయాలని బాలకృష్ణ భావించారట. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయట.
Taraka Ratna as Villian in Anil Ravipudi Film: ఇటీవలే ఒక సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. వీర సింహారెడ్డి అనే సినిమాతో ఆయన సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఆయన భార్య పాత్రలో నటించింది.
ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన మరింత జోష్ తో ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతానికి ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతుంది అని కథ కూడా చాలా కొత్తదనంతో కూడి ఉంటుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కు సంబంధించి ఒక కీలక విషయం బయటకు వచ్చింది. గతంలో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ని ఎంపిక చేసినట్లుగా ఫిలింనగర్లో ప్రచారం జరిగింది.
ఆయనకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనిల్ రావిపూడి అర్జున్ రాంపాల్ కు కధ వినిపించాడని ఆయనకు కూడా నచ్చడంతో సినిమా చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా తారకరత్న అనారోగ్య పరిస్థితుల నేపద్యంలో ఒక కీలక విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో తారకరత్నను విలన్ గా నటింపజేయాలని బాలకృష్ణ భావించారట. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయట.
తారకరత్న సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించడానికి కూడా అదే కారణం అనే వాదన వినిపిస్తోంది. ఆ లుక్ లోనే ఆయన సినిమాలో విలన్ పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యాడని ఈలోపే యువగళం పాదయాత్రలో ఆయన పాల్గొనడం, అక్కడ అనూహ్యంగా కార్డియాక్ అరెస్టుకి గురికావడం జరిగిందని అంటున్నారు. ఇక తారకరత్న అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో బాలకృష్ణ అన్ని తానే అయి వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయం లేదని తెలుసుకున్న తర్వాతే ఆయన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకపాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది కానీ అందుకు సంబంధించిన అధికారిక సమాచారం అయితే వెలువడాల్సి ఉంది.
Also Read: Shaakuntalam Postponed: మరోమారు వాయిదా పడిన సమంత శాకుంతలం.. అందుకేనా?
Also Read: Balakrishna Mantra: 'తారకరత్న' గుండెను మళ్లీ కొట్టుకునేలా చేసిన మహామృత్యుంజయ మంత్రం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook