Balakrishna Mantra: 'తారకరత్న' గుండెను మళ్లీ కొట్టుకునేలా చేసిన మహామృత్యుంజయ మంత్రం?

Balakrishna Mahamrityunjaya Mantra: కుప్పంలో దాదాపు 45 నిమిషాల పాటు తారక రత్న  గుండె ఆగిపోయిందని బాలకృష్ణ వెళ్లి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడని మృత్యుంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని అంటున్నారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 31, 2023, 07:25 PM IST
Balakrishna Mantra: 'తారకరత్న' గుండెను మళ్లీ కొట్టుకునేలా చేసిన మహామృత్యుంజయ మంత్రం?

Balakrishna Mahamrityunjaya Mantra in Taraka Ratna Ears: నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి తాజాగా కీలక విషయాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్న సీటీ స్కాన్ వివరాలు బయటకు రాగా ఆయన బ్రెయిన్ కి ఆక్సిజన్ తక్కువ అందడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అధికారికంగా డాక్టర్లైతే ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ప్రచారం అయితే మొదలయింది.

ఇక తాజాగా ప్రొడ్యూసర్స్ సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ కీలక విషయాలు బయట పెట్టారు. నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్న ఆయన బెంగళూరులో తారకరత్నను అడ్మిట్ చేసిన హాస్పిటల్లోనే ఉన్నారు. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన ఆయన తారకరత్న కోరుకుంటున్నారని కాళ్లు చేతులు కదుపుతున్నారని అన్నారు. తారకరత్న అపస్మారక స్థితిలో ఉండి కూడా బాలకృష్ణ మాట విన్న వెంటనే ఆయన చెల్లించారని ఆయన పేర్కొన్నారు.

నిజానికి కుప్పంలో దాదాపు 45 నిమిషాల పాటు గుండె ఆగిపోయిందని బాలకృష్ణ వెళ్లి తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రం చదివాడని మృత్యుంజయ మంత్రం చదివిన వెంటనే హార్ట్ రీ ఫంక్షనింగ్ జరిగిందని అన్నారు. అంతేకాక అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా తారకరత్నను బాలకృష్ణ అనుకున్నారని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. ఇక చేతి వేళ్ళకు కదలికలు ఉంటే మెదడు కూడా బాగానే పనిచేస్తుందని డాక్టర్లు అన్నారని, ఒకరకంగా తారకరత్న 100% సేఫ్ గా ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దని కోరిన ఆయన యువగళం పాదయాత్ర వలన డిక్లేర్ చేయడం లేదని వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నారు.

సినీ పరిశ్రమంలో అసలు వివాదమే లేని నటుడు తారకరత్న అని ఆయన కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తున్నారని ప్రసన్న కుమార్ అన్నారు. కుటుంబం అంతా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారని, బ్రెయిన్ ఫంక్షన్ కి ఇంకా ఎంత టైం పడుతుంది అన్నది డాక్టర్లు నిర్ధారించలేరని తుమ్మల అన్నారు. దానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన ఎక్కువ ఎక్మో , స్టంట్ అనేవి జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి హార్ట్ కిడ్నీ లివర్ వంటివి పర్ఫెక్ట్ గా పని చేస్తున్నాయని సోషల్ మీడియాలో వచ్చే మెలినా, స్మెల్ వస్తుందనే మాటలు పచ్చి అబద్ధమని, ఫేక్ ప్రచారాలు ఆపమని కోరారు.
Also Read: Taraka Ratna CT Scan Reports:తారక రత్న సీటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు..బ్రెయిన్ కు ఎఫెక్ట్?

Also Read: NTR 30 Shooting : ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొరటాల సినిమా షూటింగ్ అప్పటి నుంచే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News