Taraka Ratna Parents Names: మరీ ఇంత కోపమా.. తారకరత్న దశదిన కర్మ పోస్టర్ మీద కనిపించని తల్లితండ్రుల పేర్లు!
Taraka Ratna Parents Names Missing: నందమూరి తారకరత్న దశదినకర్మకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్లో తారకరత్న తల్లి తండ్రుల పేర్లు కనిపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.
Taraka Ratna Parents Names Missing Shradhanjali Poster: నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనని కుప్పం హాస్పిటల్ కి అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించినా సరే ఆయనను వైద్యులు కాపాడలేకపోయారు. విదేశాల నుంచి వైద్యులు వచ్చి ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు కానీ చివరికి విధే గెలిచింది.
నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. అయితే నందమూరి తారకరత్న అంత్యక్రియలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ లో మోకిలా అనే ప్రాంతంలో ఉన్న నివాసానికి ముందుగా తరలించారు. ఆ నివాసానికి తారకరత్న తల్లిదండ్రులు రాక పోవడం చర్చనీయాంశంగా మారింది. తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ ఆయన భార్య శాంతి తారకరత్నను చివరిసారి కూడా చూసేందుకు ఆ నివాసానికి వెళ్ళకపోవడం చర్చనీయాంశమైంది. తర్వాత తారకరత్న పార్థీవ దేహాన్ని ఫిలిం చాంబర్కు తరలిస్తే అక్కడికి వెళ్లి తమ బాధ్యతలు వారు నిర్వర్తించారు.
శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించారు. అయితే మోకిలలో ఉన్నది తారకరత్న భార్య తరపు నివాసం కాబట్టి వారు అక్కడికి వెళ్లలేదని ప్రచారం అయితే జరిగింది. నందమూరి కుటుంబం నుంచి క్లారిటీ రాలేదు కానీ ఆ కుటుంబానికి సన్నితంగా ఉన్న కొంత మంది మాత్రం అదేమీ నిజం కాదని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మరోసారి నందమూరి మోహనకృష్ణ- శాంతి దంపతుల వ్యవహారం చర్చనీయాంశం అవుతుంది. నందమూరి తారకరత్న దశదినకర్మకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో తారకరత్న 18వ తేదీన మరణించారు కాబట్టి ఆయన పెద్దకర్మ మార్చి రెండో తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరుగుతాయని పేర్కొన్నారు.
అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా నందమూరి బాలకృష్ణ, వేణుంబాక విజయ్ సాయి రెడ్డి అలాగే వారి కుటుంబాలు అనే పేర్లు మెన్షన్ చేశారు. మరో పక్క అలేఖ్య రెడ్డి కుటుంబానికి సంబంధించిన టి మధుసూదన్ రెడ్డి, టి శ్రీ హరిప్రియ, టి అవనీష్, టి ముక్తి అనే పేర్లు రాశారు. మరోపక్క నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పేరు వారి కుమార్తె నిష్క, కుమారుడు తనయ్ రామ్, కుమార్తె రేయ పేర్లు మెన్షన్ చేశారు. కానీ ఎక్కడా తారకరత్న తల్లిదండ్రుల పేర్లు మెన్షన్ చేయకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కావాలనే వారు పేర్లు వేయవద్దన్నారా? లేక ఇది వారి ప్రమేయం లేకుండా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Anchor Sowmya Dance: బాలయ్య పాటకు యాంకర్ సౌమ్య అదిరిపోయే స్టెప్పులు.. ఆ గ్రేస్ చూడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి