Aditi Rao Hydari - Siddharth Dance: ప్రేమ నిజమే, సిద్దూతో కలిసి హీరోయిన్ చిందులు.. ఇక అనౌన్స్ చేయడమే!

Aditi Rao Hydari, Siddharth Dance: గత కొన్నాళ్లుగా హీరోయిన్ అదితీరావు హైదరి హీరో సిద్ధార్థ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా సంగతి తెలిసిందే, ఇప్పుడు వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఒక రీల్ చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 27, 2023, 10:16 PM IST
Aditi Rao Hydari - Siddharth Dance: ప్రేమ నిజమే, సిద్దూతో కలిసి హీరోయిన్ చిందులు.. ఇక అనౌన్స్ చేయడమే!

Aditi Rao Hydari, Siddharth Dance for Tum Tum: హీరోయిన్ అదితీరావు హైదరి హీరో సిద్ధార్థ ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ మహాసముద్రం అనే సినిమాలో కలిసిన నటించడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అనేక రకాల ప్రచారం జరుగుతున్నాయి. కానీ దీని గురించి ఈ జంట అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు.

అయితే ఈ మధ్యకాలంలో పలు ఫంక్షన్లకు కలిసి వెళుతూ ఉండడంతో దాదాపు వీరిద్దరూ ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సంగతి అలా ఉంచితే తాజాగా అదితీ రావు హైదరి, సిద్ధార్థ్ తో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా ట్రెండింగ్ లో ఉన్న ఒక పాటకు ఈ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

ఈ వీడియో షేర్ చేసి ఈ ఆర్టికల్ రాసే సమయానికి మూడు గంటలు అయినా సరే వీరికి 289కే లైక్స్ తో పాటు వ్యూస్ కూడా గట్టిగానే వచ్చాయి. పలువురు సెలబ్రిటీలు సైతం వీరికి ఆల్ ది బెస్ట్ అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు. నికిత శర్మ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అబ్సల్యూట్ లౌడ్ దిస్ టూ క్యూట్ అని మెసేజ్ పెడితే హన్సిక కూడా క్యూట్ అని కామెంట్ చేసింది. ఇక సోఫీ చౌదరి అనే ఒక మోడల్ ఈ రెండు కోతులు చాలా అందంగా ఉన్నాయి అంటూ కామెంట్ చేసింది.

ఇక వీరు మాత్రమే కాదు పలు అభిమానులు సైతం ఎందుకు ఇది ఇంకా లేట్ చేస్తున్నారు త్వరగా మీ లవ్ అనౌన్స్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక దియామీర్జా కూడా లవ్ లవ్, ఈసారి ఈ కోతుల నుంచి ఇంకా ప్రేమ కావాలి అంటూ కామెంట్ చేసింది. అయితే వీరి త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా చేసి వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిద్ధార్థ గతంలో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా అదితీరావు హైదరి సైతం అలాగే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. 

Also Read: Ram Charan Plastic Surgery: అప్పుడు చరణ్ ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయ్.. సర్జరీ ముందు తరువాత ఎలా ఉన్నాడో తెలుసా?

Also Read: Jr NTR Lipo Surgery: బాడీ షేమింగ్ తో ఇబ్బంది పడి ఇండియాస్ బెస్ట్ యాక్టర్ గా నిలబడ్డ ఎన్టీఆర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News