Alekhya Reddy Remembers Taraka Ratna తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి అంటే ఇప్పుడు అందరికీ కొంత సంపతీ, జాలి వంటివి ఉన్నాయి. తారకరత్న, అలేఖ్యల ప్రేమ, పెళ్లి, కుటుంబం నుంచి తోడ్పాటు, సాయం వంటివి అందకుండా ఇన్నేళ్లు వేరుగా ఉండటం వంటివి అందరికీ తెలిసిందే.. అలేఖ్య రెడ్డి మీద అందరికీ ఓ పాజిటివ్ ఇమేజ్ ఏర్పడింది. తారకరత్న ఇన్ని కష్టాలు పడ్డాడా? సొంత అమ్మానాన్నలు కూడా ఆదరించలేదా? కోడల్ని, మనవరాల్లని కూడా పట్టించుకోవడం లేదా? అని అంతా అనుకుంటూ ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తారకరత్న మరణించిన తరువాత విజయసాయి రెడ్డి, బాలయ్య మాత్రమే తమకు అండగా ఉన్నట్టుగా అలేఖ్య రెడ్డి చెప్పుకొచ్చింది. తమకు అప్పుడూ ఇప్పుడూ అండగా నిలబడింది వాళ్లే అని అలేఖ్య తన ఇన్ స్టా పోస్టుల్లో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా తారకరత్న గురించి చెబుతూ భర్త మీద తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పేసింది.


 



ఈ జన్మకు జీవితం ఇంతే అని, తారకరత్నే తన లోకమని చెప్పుకొచ్చింది. తారకరత్న మెమోరీస్‌తోనే ఈ జీవితాంతం బతికేస్తాను అని, శ్వాస ఉన్నంత వరకు కూడా తారకరత్ననే ప్రేమిస్తుంటాను అని ఇలా అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ వేసింది. ఇక పాత ఫోటో ఒకటి అలేఖ్య రెడ్డి షేర్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Also Read:  Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి


తారకరత్న మరణం తరువాత అలేఖ్య రెడ్డి వేస్తోన్న ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. జీవితంలో తారకరత్న ఎంతగా పోరాడాడు.. ఒంటరిగా ఎలా నిలబడ్డాడు.. తన కోసం ఎన్ని త్యాగాలు చేశాడు అంటూ జీవితంలో పడ్డ బాధలను ఒక్కొక్కటిగా చెబుతూ అలేఖ్య రెడ్డి పోస్టులు వేస్తూనే వచ్చింది. ఇలా తాజాగా తన భర్త మీదున్న అమిత ప్రేమను చూపించింది.


Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook