TDP Responds on Kapunadu Ultimatum:తాజాగా జరిగిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ఒక నటుడు గురించి ప్రస్తావిస్తూ ఈయనతో సెట్ లో ఉంటే సమయం తెలియదని పురాణాలు, వేదాలు మొదలు ఆ రంగారావు ఈ రంగారావు, నాన్నగారు, డైలాగులు అక్కినేని, తొక్కినేని అంటూ ఎక్కడ వరకు మా చర్చలు సాగుతూ ఉంటయో మాకే తెలియదని చెప్పుకొచ్చారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ క్రమంలో అక్కినేని తొక్కినేని ఎలా మాట్లాడుతారు అంటూ పెద్ద ఎత్తున అక్కినేని అభిమానులు ఆయన మీద ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం మీద కాపునాడు కూడా ఎంట్రీ ఇచ్చి ఎస్వి రంగారావు గారిని ఆ రంగారావు ఈ రంగారావు అని కించపరుస్తారా ఎస్వీ రంగారావు గారు మా కాపు జాతి ముద్దుబిడ్డ ఆయనను కించపరిస్తే మా అందరినీ కించపరిచినట్లు అని చెబుతూ గతంలో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన మాటలను, పవన్ కళ్యాణ్ జనసేన గురించి మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ అల్టిమేటం జారీ చేసింది.


ఈ విషయం మీద కనుక ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రంగా విగ్రహాల వద్ద ఆందోళనకు దిగుతామని ప్రకటించింది. అంతేకాక నందమూరి బాలకృష్ణను పదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించింది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే తాజాగా ఇదే విషయం మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది.


‘’ఎస్వీ రంగారావు గారి గురించి అని గౌరవపూర్వకంగా సంభోదించినా వైసీపీ నుండి వచ్చిన ఆదేశాలతో కులాల కుంపటి పెట్టాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తులతో జాగ్రత్తగా ఉండాలి అని మనవి, బాలకృష్ణ గారు ఏ దురుద్దేశ్యం లేకుండా అన్న మాటను మార్ఫింగ్ చేసి మరొక వీడియో కి జత చేసి అభిమానులను రెచ్చగొడుతున్న మీడియా ఛానెల్స్ , వెబ్ సైట్స్ చట్టం ముందు దోషులుగా నిలబడతాయని చెబుతూనే నందమూరి బాలకృష్ణ మాట్లాడిన వీడియోని మరోసారి షేర్ చేశారు.


ఇక ఇలా టీడీపీ పేర్కొనడం చూస్తుంటే కచ్చితంగా ఈ విషయంలో బాలకృష్ణ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని భావించాల్సిందే. అదే విధంగా ఆయన మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని టీడీపీ సమర్థిస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. అయితే అక్కినేని కుటుంబ సభ్యులలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఇప్పటికే ఈ విషయం మీద స్పందించిన నేపద్యంలో అక్కినేని అభిమానులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వారు కూడా ఈ విషయం మీద ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరకంగా చూసుకుంటే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.


Also Read: Telugu Woman Died: పోలీసు వాహనం ఢీ కొట్టి తెలుగమ్మాయి మృతి.. అసలేమైంది?


Also Read: Vijay Antony Health: విజయ్ అంటోనీ ఫాన్స్ కు గుడ్ న్యూస్... సర్జరీ సక్సెస్.. ఆల్ సెట్!