Annaatthe Teaser : దసరా కానుకగా రానున్న రజనీకాంత్ ‘అన్నాత్తే’ టీజర్..
Teaser of Rajinikanths Annaatthe: సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తే మూవీ మోషన్ పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది
Teaser of Rajinikanths Annaatthe to be Out on October 14 Film Set for Diwali Release: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు (Rajinikanth) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’ (Annaatthe) కోసం ఎన్నో రోజుల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ (sun pictures) పతాకంపై కళానిధిమారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ మోషన్ పోస్టర్స్ (motion poster), సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది.
Also Read : Nagababu Resignation: ‘'మా'’ అసోసియేషన్‌పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
ఈ చిత్ర టీజర్‌ని దసరా (dussehra) కానుకగా అక్టోబర్ 14న విడుదల సాయంత్రం 6 గంటలకు చేయనున్నారు. అన్నాత్తే మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కచ్చితంగా రికార్డులు తిరగ రాస్తుందంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ మూవీలో కీర్తిసురేశ్ (Keerthy Suresh), మీనా, ఖుష్బూ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి డి. ఇమ్మన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అన్నాత్తే (Annaatthe) మూవీ నవంబర్ 4న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (sp balasubrahmanyam) పాడిన చివరి పాట ఉంది.
Also Read : MAA Elections: ‘మా’ ఎన్నికల ఫలితాలపై అనసూయ కామెంట్స్..బ్యాలెట్ పేపర్లని ఇంటికి తీసుకెళ్లారట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook