Darling Release Date: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా.. నటించిన హనుమాన్ సినిమా చాలా తక్కువ అంచనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలను సైతం తలదన్ని మరి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో సినిమాగా.. విడుదలైన ఈ చిత్రం సీక్వెల్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్.. పతాకం పై.. ఈ సినిమాని నిరంజన్ రెడ్డి అతని భార్య.. చైతన్య రెడ్డి నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు. 


డిస్ట్రిబ్యూటర్లకు మాత్రమే కాక నిర్మాతలకి కూడా ఈ సినిమా భారీగానే ప్రాఫిట్ లు తెచ్చిపెతట్టింది. ప్రస్తుతం చైతన్య రెడ్డి ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న డార్లింగ్ సినిమా అని నిర్మించారు. ఆ సినిమా ఈవారం విడుదలకి.. సిద్ధం అవుతుంది. 


ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య రెడ్డి పలు ఇంటర్వ్యూలలో.. పాల్గొంటున్నారు. అందులో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మధ్య వస్తున్న పాన్ ఇండియా, భారీ బడ్జెట్ సినిమాల గురించి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశారు. ఆమె అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా తీసేసి.. టికెట్ రేట్లు పెంచేసి.  ఆడియన్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి.. అని నాకు లేదు. అలా చేస్తే అందరూ ప్రేక్షకులు థియేటర్లకి రారు. 200 టికెట్ ఉన్నప్పుడు.. 200 మంది సినిమా చూస్తే.. 400 రూపాయలు టికెట్ ఉన్నప్పుడు.. 100 మంది లేదా 50 మంది మాత్రమే చూడొచ్చు. అందుకే ప్రొడక్షన్ నిర్మాణ విలువలు బాగుండాలి తప్ప బడ్జెట్ పెరగకూడదు.. అని అన్నారు చైతన్య రెడ్డి. అయితే ఈ మాటలు కల్కి సినిమా గురించే అంటున్నారు.. చాలా మంది.


అయితే నెటిజన్లు మాత్రం ఈ విషయంలో పూర్తిగా ఏకీభవించడం లేదు. కొన్ని సినిమాల విషయంలో ఆమె చెప్పినది వర్కౌట్ అయినప్పటికీ.. అన్ని సినిమాలలోనూ.. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలు.. విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండే సినిమాల విషయంలో ఇది వర్కౌట్ అవదు.. అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి