Hanuman Theaters Issue: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా మొదటి షో నుంచే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. కాగా ఈ సంక్రాంతి పండుగకు హనుమాన్ సినిమాతో పాటు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మిగతా మూడు సినిమాలు స్టార్ హీరోలవి కావడం విశేషం. అందులో మహేష్ బాబు గుంటూరు కారం హనుమాన్ సినిమా విడుదలైన రోజే అనగా జనవరి 12న విడుదల కాగా.. వెంకటేష్ సైంధవ్ జనవరి 13న…నాగార్జున నా సామిరంగా జనవరి 14న విడుదల తేదీ ఖరారు చేసుకున్నాయి.  ఇలా నాలుగు సినిమాలు దాదాపు ఒకటి రెండు రోజులు అటు ఇటుగా విడుదలవుతూ ఉండటంతో.. థియేటర్స్ విషయంలో గందరగోళం ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ LLP వారు "హనుమాన్" చిత్రాన్ని 12-01-2024 నుండి  ప్రదర్శన కొరకు తెలంగాణాలో కొన్ని థియేటర్లు వారితో అగ్రీమెంటు చేయడం జరిగింది. అయితే ఆ థియేటర్ల వారు ఈ  అగ్రీమెంటు ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా లో  అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్ల లో ఈ  సినిమా ప్రదర్శన చేయ లేదు. ఇదే విషయంపై  మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత నిరంజన్ రెడ్డి గార్లు ఫిర్యాదు చేయడం జరిగింది.  


తమతో చేసుకున్న థియేటర్లు అగ్రీమెంటు ప్రకారం "హనుమాన్" చిత్రం ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఆపార నష్టం జరిగిందని కావున థియేటర్లు వెంటనే  "హనుమాన్" సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు  జరిగిన నష్టం భరించాలి‌ అని ప్రెస్ రిలీజ్ చేశారు.
  


“థియేటర్ల వారి ఇటువంటి చర్యల వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం.  థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తూ మరియు ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం నైతికత నిబద్దత న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ప్రదర్శకులు వారి పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ "హనుమాన్" సినిమాకి సత్వర న్యాయం చేయాలనీ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుచున్నది” వారిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 


Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?  


Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook