HanuMan Trailer Out: టాలీవుడ్‌ యంగ్ హీరో తేజ సజ్జా (Tejasajja) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హనుమాన్‌ (HanuMan). ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇదులో తేజాకు జోడిగా కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ  కావడంతో హనుమాన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది.  తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''యథో ధర్మా స్తథో హనుమా.. యథో హనుమ స్తథో జయ''.. అనే బ్యాక్ గ్రాండ్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవుతోంది. తేజ యాక్షన్ ఇరగదీశాడు.''పవర్‌ సూట్‌లో ఉంటే సరిపోదు.. సిరి.. నాలో ఉండాలి.. నా నరనరాల్లో ప్రవహిస్తూ ఉండాలి. అలాంటి పవర్ ఎక్కడ ఉంది'' అని విలన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ''పోలేరమ్మ మీద ఒట్టు.. నా తమ్ముడి మీద చెయ్యి పడితే టెంకాయలు పగిలిపోతాయి'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మానవాళి మనుగడను కాపాడేందుకు నీ రాక అనివార్యం హనుమాన్ అనే డైలాగ్ తో ట్రైలర్ ముగిస్తోంది.  బీజీఎం అయితే అదిరిపోయింది. ఇక విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 



Also Read: Bigg Boss Shivaji: నన్ను పక్కనపెట్టి.. పల్లవి ప్రశాంత్ ని విన్నార్ గా..: బిగ్ బాస్ ఓటమిపై శివాజీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook