TFI meet with Revanth Reddy: టాలీవుడ్ ఇవి పాటించాల్సిందే.. సీఎం మీటింగ్ లో ఏం చెప్పారంటే..!
TFI meeting with Revanth Reddy : ఈరోజు టాలీవుడ్ ప్రముఖులందరూ కలిసి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కొన్ని కీలక విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ప్రభుత్వానికి ఏమి చేయగలదు అని.. అలానే ప్రభుత్వం సినిమా పరిశ్రమకు ఏమి చేస్తుంది అనే కొన్ని కీలక అంశాల మీద చాలా సేపే ఈ సమావేశం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Revanth Reddy TFI meeting: ఎట్టకేలకు ఈ రోజున టాలీవుడ్ పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ..చిన్నపాటి గొడవలకు సైతం చెక్ పడిందని చెప్పవచ్చు. ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ నుంచి చాలామంది.. సెలబ్రిటీలతో పాటు FDC దిల్ రాజు కూడా.. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి పలు విషయాలను చర్చించడం జరిగింది. అయితే ఇలా చర్చించిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు అండగానే ఉంటామని.. కానీ సినీ సెలబ్రిటీలు పాటించాల్సిన అంశాలు ఇవే అంటూ కొన్ని కీలకమైన పాయింట్స్ ని తెలియజేశారట.
సినిమా పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో.. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా స్పందిస్తూ..”సినిమా పరిశ్రమ సమస్యలను మా ద్రుష్టికి తెచ్ఛారు. అనుమానాలను, అపోహలు, ఆలోచనలను పంచుకున్నారు..ఇప్పటివరకు 8 సినిమాలకు..మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చాం...పుష్ప 2 సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాము. తెలుగు సినిమా పరిశ్రమ అంటేనే ఒక బ్రాండ్ ఉండాలని ఇలా చేసాము.. సిని పరిశ్రమ బాగుండాలని తాము కూడా కోరుకుంటున్నాం,” అని తెలిపారు.
ఐటీ, ఫార్మా తో పాటు మాకు సినిమా పరిశ్రమ ముఖ్యం...తెలంగాణ లో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ కు మధ్యవర్తి గా ఉండడానికి దిల్ రాజు ను FDC ఛైర్మన్ గా నియమించాం..సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశాం,” అంటూ వెల్లడించారు.
సినీ పరిశ్రమ కూడా కమిటీ ని ఏర్పాటు చేసుకోవాలి.తెలంగాణ లో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని, హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చు.తెలంగాణ లోని..ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ ను ప్రతి ఒక్కరూ చేయాలి..ముంబయిలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది.. మనకి కూడా కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ. హాలివుడ్,బాలీవుడ్.. హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపట్టాలని.. తెలిపారు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి, ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని..పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని తెలిపారు.
“యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా..అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం.140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్ లో పతకాలు తెచ్చుకోలేకపోతుంది.. అందుకోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేయబోతున్నాం… గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం కచ్చితంగా చెయ్యాలి. సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేస్తుంది..ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం,” అని తెలిపారు. సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే తమ ముఖ్య ఉద్దేశమని.. తనకు వ్యక్తిగతమైన ఇష్టాలు అనేవి లేవని.. తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దామని.. ప్రభుత్వం సిని పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు రేవంత్ రెడ్డి.మొత్తానికి ఈ రోజున అటు సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మంచి బాండింగ్.. ఏర్పడిందని చెప్పవచ్చు.
Also Read: Jr NTR Fan: జూనియర్ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్.. కౌశిక్ తల్లి వివరణ ఇదే!
Also Read: Dil Raju: సంధ్య థియేటర్ బాధిత రేవతి భర్తకు దిల్ రాజు బంపర్ ఆఫర్.. సినిమా ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.