Hema Committee Report: మలయాళం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు #MeToo ఉద్యమం మరొకసారి మొదలైంది. కానీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, లింగ సమానత్వ సమస్యలపై విచారణ చేయడానికి గతంలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ కమిటీలో పోలీసు అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, చిత్ర పరిశ్రమ, టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కమిటీ ఒక ఉపకమిటీని కూడా ఏర్పాటు అయ్యింది. ఆ కమిటీ లైంగిక వేధింపుల ఫిర్యాదులు, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన అంశాలను పరిశీలించింది. 2019 నుండి 2022 వరకు ఈ ఉపకమిటీ 20కి పైగా సమావేశాలు జరిపింది. ఇందులో 24 క్రాఫ్ట్స్ కౌన్సిల్‌ లలో 15 కౌన్సిల్స్‌తో సమావేశమై, చిన్నా పెద్ద నటులు, డ్యాన్సర్ లు, మేకప్ ఆర్టిస్టులు, డ్రైవర్లు వంటి వాళ్ళ లైంగిక వేధింపుల కేసులు, వేతనాలు చెల్లించకపోవడం వంటి అంశాలపై చర్చించింది.


జర్నలిస్ట్ ఆయేషా మిన్హాజ్ తన సోషల్ మీడియా వేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఉపకమిటీ 2022 జూన్‌లోనే తన నివేదికను అప్పటి ప్రభుత్వం దాఖలు చేసింది. కానీ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టింది అని సమాచారం. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ, నివేదికను బహిరంగ పరచాలన్న ప్రతినిధులు విజ్ఞప్తులు చేసినా కూడా అవి బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.


తాజాగా ఈ మధ్య కేరళలో హేమ కమిటీ నివేదిక బయటపడటంతో.. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఇటువంటి నివేదికలు ప్రజల ముందుకు రావాలని, ఆ సమస్యలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు హేమ కమిటీ నివేదిక.. మలయాళం ఇండస్ట్రీలో ఒక సంచలనాన్ని సృష్టించింది. సోషల్ మీడియాలో ఇప్పటికి దీని గురించి నాకు చర్చ జోరుగా సాగుతోంది. ప్రముఖ మలయాళం సెలబ్రిటీలు కూడా దీని గురించి రియాక్ట్ అయ్యారు. మోహన్ లాల్ కూడా ఈ విషయంలో కామెంట్ చేశారు. 


ఈ నివేదిక తర్వాత చాలా మంది యువ నటీమణులు కూడా తమపై జరిగిన వేధింపులను బయటపెట్టడానికి ముందుకు వస్తున్నారు. దర్శకుడు రంజిత్, నటుడు సిద్ధిఖ్ లపై ఇప్పటివరకు కేసులు నమోదయ్యాయి. అంతేగాక, మలయాళ మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (AMMA) కూడా రద్దయ్యింది. సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్‌పై కూడా నటి పట్ల లైంగిక దాడి ఆరోపణలతో నాన్‌బేలబుల్ కేసు నమోదు చేశారు.


Also Read: Khammam Floods: వరద సహాయాల్లో అపశ్రుతి.. బైక్‌పై నుంచి కిందపడ్డ పొంగులేటి శ్రీనివాస్‌


Also Read: No Selfies: తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక! జలాశయాల వద్ద సెల్ఫీలు.. ఫొటోలు వద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter