Telangana High Court: భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2: ది రూల్‌ సినిమాకు తెలంగాణ హైకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. సినిమా ధరలు పెంచుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అడ్డగోలుగా సినిమా ధరలు పెంచుకోవడాన్ని తప్పుబట్టింది. ఇలా అయితే సామాన్యుడు సినిమా ఎలా చూస్తాడని ప్రశ్నించింది. సినిమా ధరలు పెంచడంతోపాటు బెనిఫిట్‌ షోలు వేసుకోవడంపై నిలదీసింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి అక్షింతలు వేసింది. వెంటనే వివరాలు తెలపాలని నిర్మాతలకు ఆదేశించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Allu Arjun: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏడ్చేసిన అల్లు అర్జున్, సుకుమార్.. అభిమానులు కూడా కన్నీళ్లు


 


పుష్ప 2 సినిమా ధరలు పెంచడం.. బెనిఫిట్‌ షోలు వేసుకోవడంపై సోమవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చిత్రబృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం' అంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదించారు. 'బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బులు ఎస్క్రో అకౌంట్‌లో పెట్టాలి' అని డిమాండ్‌ చేశారు.

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'


 


ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్దార్థ్ స్పందిస్తూ 'రెండు వారాలు సమయం కావాలి' అని కోరగా.. 'రెండు వారాలు అంటే సినిమా బెనిఫిట్ షో, సినిమా రిలీజ్ అయిపోతుంది' అంటూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ప్రతి వాదనలు చేశారు. సాయంత్రం ఆర్డర్ ఇస్తానంటూ జస్టిస్ విజయ్ సేన్ రెడీ బెంచ్ తెలిపింది. 'రూ.800 పెట్టీ సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు. ఓ కుటుంబం నుంచి 10 మంది సినిమాకు వెళ్తే రూ.10 వేలు ఖర్చు చేయాల?' అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. 'బెనిఫిట్ షో అర్ధ రాత్రి 1 గంటలకు పెట్టడం ఏమిటి' అని ప్రశ్నిస్తూనే దీనివలన 'చిన్న పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుంది' అని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు ఇంకా వెలువడలేదు. కాగా హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. దీనికితోడు సినిమా ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా న్యాయస్థానం నోటీసులు పంపే అవకాశం ఉంది. ప్రతివాదులుగా ప్రభుత్వం, చిత్ర నిర్మాతలకు ధర్మాసనం నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.