Krishnam Raju: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, రెబెల్‌స్టార్ కృష్ణంరాజుకు అరుదైన గౌరవం దక్కినట్టు తెలుస్తోంది. తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజును కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. అధికారికంగా ధృవీకరణ లేకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఆనందపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ నటుడు, రెబెల్ స్టార్‌ ( Rebelstar ) గానే కాకుండా బాహుబలి ప్రభాస్ బాబాయిగా ప్రాచుర్యం పొందిన కృష్ణంరాజు ( Krishnam raju ) కు ఇప్పుడు పెద్ద బాథ్యతే వస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ( Bjp )  నేతగా ఉన్న కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్ ( Tamil nadu Governor ) ‌గా పంపిస్తున్నారనే వార్త షికారు చేస్తోంది. సోషల్ మీడియాలో ఇదే వార్త ఇప్పుడు వైరల్ అవడమే కాకుండా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అటు కేంద్రం నుంచి గానీ కృష్ణంరాజు కుటుంబసభ్యులు గానీ ఈ విషయంపై ఏ ప్రకటనా చేయలేదు. 


నటుడిగా కెరీర్ సక్సెస్‌గా ఉన్నప్పుడే అంటే 1990లో కృష్ణంరాజు బీజేపీలో చేరారు. రెండుసార్లు ఎంపీగా పని చేశారు. 2000-2002 వరకూ వాజ్‌పేయి ప్రభుత్వ ( Vajpayee Government ) హయాంలో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత పెద్దగా రాజకీయాల్లో కన్పించలేదు. మరోవైపు 2016లో తమిళనాడు గవర్నర్ పదవి నుంచి రోశయ్య ( Rosaiah ) వైదొలగిన తరువాత..పూర్తి స్థాయి గవర్నర్‌ని నియమించలేదు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజును ఎంపిక చేస్తే బాగుంటుందనే ఆలోచనలో కేంద్రం ( Central Government ) ఉన్నట్టు తెలుస్తోంది. 


Also read: నటుడు Sonu Sood‌పై ఫిర్యాదు చేసిన బీఎంసీ, కబ్జా ఆరోపణలు సైతం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook