Telugu Heros Remuneration: తెలుగు సినిమా హీరోల పారితోషికం ఎంత ఉంటుంది? సాధారణంగా ఒక్కొక్కరు తమ హీరో అన్ని కోట్లు తీసుకుంటాడు? ఇన్ని కోట్లు తీసుకుంటాడు? అనే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఈమధ్య మన హీరోల రెమ్యూనరేషన్ల అమౌంట్ పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా హీరోలందరూ పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మొదలు టాలీవుడ్ లో ఎవరెవరు హీరోలు ఉన్నారు? వారి రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయనే విషయం మీద ఒకసారి లుక్ వేద్దాం. మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ విషయానికొస్తే ఆయన ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు పైనే పారితోషికం అందుకుంటున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన 25వ సినిమాగా రూపొందుతున్న స్పిరిట్ కోసం అయితే ఏకంగా 150 కోట్ల వరకు అందుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన డేట్లతో సంబంధం లేకుండా సినిమా చేయాలంటే ఒక్కొక్క సినిమాకు 50 కోట్ల పైగానే అందుకుంటారట. ప్రస్తుతం ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాకి డేట్లు ఎక్కువ కేటాయించాల్సి రావడంతో మరో 10 కోట్లు అదనంగా తీసుకున్నారట. ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకి ఏకంగా 55 కోట్లు తీసుకున్నాడు అని అలాగే ఆయన చేసే ప్రతి సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకుంటారని అంటున్నారు.


ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్క సినిమాకి 45 కోట్ల పైగానే అందుకుంటాడట. ఆర్ఆర్ఆర్ విషయంలో దాదాపు మూడేళ్లు డేట్స్ కేటాయించాడు కాబట్టి మరింత ఎక్కువగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా దాదాపు 45 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని డిమాండ్ ఉండటంతో దర్శక నిర్మాతలు సైతం ఏ మాత్రం కూడా వెనుకాడడం లేదని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రస్తుతం ఉన్న మార్కెట్ వేల్యూ ప్రకారం 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. అయితే ఎక్కువగా సొంత సినిమాల నిర్మాణం మీద దృష్టి పెట్టడంతో 50 కోట్లు నిజంగానే వర్క్ అవుట్ అవుతున్నాయా? లేదా? అనేది తెలియదు.


ఇక అల్లు అర్జున్ దాదాపు ఒక్కొక్క సినిమాకి 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నందమూరి బాలకృష్ణ ఒక్కొక్క సినిమా కోసం 11 ఓట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సూపర్ హిట్లు వస్తున్న క్రమంలో ఆయన ఒక్కొక్క సినిమాకు బడ్జెట్లో 15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని టాక్. ఇక సీనియర్ హీరోలలో నాగార్జున కేవలం ఒక్కొక్క సినిమాకి 7 కోట్లు మాత్రమే వసూలు చేస్తారట. ఆయన సినిమాలకు మార్కెట్ లేకపోవడంతో డిమాండ్ తక్కువగా ఉందని అంటున్నారు. వెంకటేష్ సినిమాలకు కూడా పెద్దగా మార్కెట్ లేని నేపథ్యంలో ఆయనకు 7 కోట్లు మాత్రమే ఇచ్చేవారు, కానీ ఎఫ్ 3 సినిమా విషయంలో మాత్రం ఆయన డిమాండ్ చేసి దానికి డబల్ రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారట. ఇవ్వండీ తెలుగు హీరోల రెమ్యూనరేషన్ వివరాలు, మరోసారి మరిన్ని వివరాలు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం.
Also Read: Ram Charan Removed Ayyappa Mala: అమెరికాలో రామ్ చరణ్ అయ్యప్ప మాల తీశేశాడా? అసలు ఏమైందంటే?


Also Read: Telugu OTT Releases This Week: వారసుడు, వీరసింహారెడ్డి సహా ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook