RamCharan Discontinued Ayyappa Deeksha: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమం నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుకలు కూడా మార్చి నెలలో జరగబోతూ ఉండడంతో ఆ వేడుకల వరకు కూడా ఆయన అక్కడే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ అయ్యప్ప మాల ధరించి అమెరికా వెళ్లారు. ఇక్కడి నుంచి అమెరికా వెళుతున్న సమయంలో ఆయన అయ్యప్ప మాల ధరించి వెళుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే గుడ్ మార్నింగ్ అమెరికా అనే ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్న సమయంలో మాత్రం ఆయన అయ్యప్ప మాలలో కనిపించలేదు, దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులందరూ కూడా రామ్ చరణ్ తేజ అయ్యప్ప మాలలు అమెరికా వెళ్ళాడు కదా ఇప్పుడు మాలలో లేడు ఏంటి అని అనుమాన పడుతున్నారు. కొందరైతే రామ్ చరణ్ అయ్యప్ప మాల అమెరికా వెళ్లి తీశాడు అంటూ కామెంట్లు చేస్తున్న క్రమంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే రామ్ చరణ్ తేజ అయ్యప్ప మాల ధరించి అమెరికా వెళ్ళిన మాట వాస్తవమే.
అదేవిధంగా ఆయన ఇప్పటికీ మాలధారణలోనే ఉన్నారట. కానీ గుడ్ మార్నింగ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక షోకి ఆయన సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటి హీరోగా అక్కడికి హాజరయ్యారు. అలాంటి కార్యక్రమంలో అక్కడి అమెరికెన్లకు గౌరవం ఇచ్చి ఆ షోలో పాల్గొన్నంత సేపు ఒక సూట్ లో ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. మెడలో మాలధారణ అలాగే ఉంది కానీ కేవలం నల్ల బట్టలు పక్కన పెట్టి బ్లాక్ సూట్ తో పాటు పాదరక్షలు కూడా ధరించాల్సి వచ్చిందని తెలుస్తోంది. వాస్తవానికి అయ్యప్ప మాల దీక్ష తీసుకున్న వారెవరు నల్లబట్టలో కాకుండా ఇతర రంగులు బట్టల్లో కనిపించరు. అయితే ప్రాంతాలవారీగా తమిళనాడు భక్తులు నీలం రంగు ధరిస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎక్కువగా నలుపు రంగు బట్టలు ధరిస్తూ ఉంటారు, అలాగే గురుస్వాములైన వారు కాషాయ రంగు బట్టలు ధరిస్తూ ఉంటారు.
ఎక్కువగా మాత్రం నల్లరంగు బట్టలు మాత్రమే అయ్యప్ప మాలాధారులు ధరిస్తూ ఉండడంతో వాటిని రామ్ చరణ్ తీసివేయడంతో కొత్త చర్చ మొదలైంది. అయితే అయ్యప్పదారుల దీక్ష తీసుకున్నప్పుడే వృత్తిరీత్యా వేరే బట్టలు ధరించవచ్చని దీక్ష తీసుకున్న గురు స్వాములు చెబుతూ ఉంటారు. అంటే ఉదాహరణకు పోలీసు అధికారులు కూడా కొంతమంది దీక్ష తీసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వారు కేవలం నల్ల కండువా మాత్రమే మెడలో ధరిస్తూ ఉంటారు, ఖాఖీ బట్టల్లోనే ఉంటారు. కానీ దీక్ష మాత్రం నియమనిష్టలతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా వృత్తి రీత్యా వేరే దేశం వెళ్లాడు కాబట్టి ఆ షోలో పాల్గొనాల్సి రావడంతో సూట్ లో కనిపించాడని కార్యక్రమం పూర్తయిన తర్వాత రామ్ చరణ్ మళ్ళీ తన మాల ధారణ దుస్తులు ధరించారని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook