No Remake Heros: ఎన్ని డిజాస్టర్లు వచ్చినా ఒక్క రీమేక్ జోలికి కూడా పోని హీరోలు ఎవరో తెలుసా?
Telugu Heros Who are not interested to Make Remake Movies: అసలు రీమేక్ సినిమాలంటే ఇష్టం లేని ఆ రీమేక్ సినిమాలు చేయడానికి ఇష్టపడని హీరోలు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. వారు ఎవరెవరు అనేది చూస్తే
Telugu Heros Who are not interested to Make Remake Movies: సాధారణంగా ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణం. ఈ మధ్యకాలంలో ఈ రీమేక్ సినిమాల ట్రెండు బాగా పెరిగిపోయింది. ఎక్కడో వేరే భాషలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలు తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేస్తున్నారు. నందమూరి తారక రామారావు సినీ కెరీర్ లో 50 కి పైగా సినిమాలు రీమేక్ చేశారంటే ఈ రీమేక్ ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇలా 50 సినిమాల మొదలు ఒక్కొక్క సినిమా వరకు రీమిక్స్ చేస్తున్న హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు. కానీ అసలు రీమేక్ సినిమాలంటే ఇష్టం లేని ఆ రీమేక్ సినిమాలు చేయడానికి ఇష్టపడని హీరోలు కూడా టాలీవుడ్ లో ఉన్నారు. వారు ఎవరెవరు అనేది చూస్తే ముందుగా మహేష్ బాబు గురించి చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఇప్పటివరకు తన కెరీర్ మొత్తం మీద ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు.
ఎవరో తీసిన సినిమాలలో మళ్లీ తాను కనిపించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని ఆయన గతంలో ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే ఆయన నటించిన నాని సినిమా రీమేక్ అనుకుంటారు కానీ అది తమిళ, తెలుగు భాషలలో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించారు. తెలుగులో మహేష్ నటిస్తే తమిళంలో ఎస్జే సూర్య నటించారు. ఈ రెండు సినిమాలకు ఎస్జే సూర్యనే దర్శకత్వం కూడా వహించారు. ఇక అల్లు అర్జున్ కూడా తన కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు.
అలా రీమేక్ చేసిన సినిమాలు చేయడానికి తనకి కూడా ఇష్టం ఉండదట. ఇక సాయి ధరంతేజ్ కూడా తన కెరీర్ లో ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. ఎన్ని సినిమాలు డిజాస్టర్లు అవుతున్నా ఆయన ఎందుకో కానీ ఆ రీమేక్ సినిమాల జోలికి పోలేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా తన కెరీర్ లో ఒక్క రీమేక్ సినిమా జోలికి కూడా వెళ్లలేదు. తన కెరీర్ గ్రాఫ్ ఎలా ఉన్నా సరే రీమేక్ విషయాలలో ఆసక్తి చూపించడం లేదనే చెప్పాలి.
Also Read: The Ghost Movie: చిరు కోసం నాగ్ త్యాగం చేయడం లేదట.. పోటీ పక్కా ఇక!
Also Read: Tollywood Heros Remakes: తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోలు ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి