Tollywood Heros Remakes: తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోలు ఎవరో తెలుసా?

Tollywood Heros Who Made Highest Remake Movies: Here is the List: సినిమాలను రీమేక్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మొదలైంది అని అనుకుంటారు. కానీ ఈ ట్రెండు ఇప్పటిది కాదు. తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోల లిస్టు మీ కోసం

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 13, 2022, 03:22 PM IST
Tollywood Heros Remakes:  తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోలు ఎవరో తెలుసా?

Tollywood Heros Who Made Remake Movies: Here is the List సాధారణంగా సినిమాలను రీమేక్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మొదలైంది అని అనుకుంటారు. కానీ ఈ ట్రెండు ఇప్పటిది కాదు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు సమయంలో ఒక భాషలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని మన భాషలో తీసుకువచ్చే ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొంతమంది సినిమాలు డబ్బింగ్ చేసి విడుదల చేస్తే మరి కొంత మంది మాత్రం రీమేక్ చేయడానికి ఇష్టపడుతుంటారు.

అలా తెలుగులో ఇప్పటివరకు రీమేక్ సినిమాలు ఎక్కువగా చేసిన హీరోల విషయానికి వస్తే అందరికంటే ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ సుమారు 50 రీమేక్ సినిమాలు తన కెరీర్ మొత్తం మీద చేశారు.

ఆయన తర్వాత స్థానాన్ని అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేశారు. సుమారు ఆయన 42 రీమేక్ సినిమాలు చేశారు.

తర్వాత కృష్ణంరాజు తన కెరీర్ లో 25 రీమేక్ సినిమాలు చేశారు.

వెంకటేష్ తన కెరీర్ లో25 రీమేక్ సినిమాలు చేశారు.  

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో మొత్తం మీద 17 రీమేక్ సినిమాలు చేశారు. ఆయన ఈ మధ్యకాలంలో మరిన్ని రీమేక్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

బాలకృష్ణ కెరియర్ లో 12 రీమేక్ సినిమాలు చేశారు.

ఇక నాగార్జున కూడా తన కెరీర్ లో 12 రీమేక్ సినిమాలు చేశారు.

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో 11 రీమేక్ సినిమాలు చేశారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో పది రీమేక్ సినిమాలు చేశారు.

ఇక ఆ తర్వాత రవితేజ తన కెరీర్ లో ఐదు రీమేక్ సినిమాలు చేస్తే సుమంత్ కూడా ఐదు రీమేక్ సినిమాలు చేశారు.

తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కూడా తన కెరీర్ లో నాలుగు రీమేక్ సినిమాలు చేశారు. నిఖిల్ సిద్ధార్థ్ 3, కళ్యాణ్ రామ్ 3, నాని 2, రామ్ చరణ్ 2,శర్వానంద్ 2 నాగచైతన్య 2 ప్రభాస్ 2 రామ్ పోతినేని 2, రానా దగ్గుబాటి 2, నితిన్ 2, జూనియర్ ఎన్టీఆర్ 1 అడవి శేషు 1 రీమేక్ సినిమాల్లో నటించారు.
Also Read: Krishnam Raju Assets: వందల ఎకరాలు.. ఇళ్లు, బంగ్లాలు.. కృష్ణంరాజు ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Also Read: NMBK: గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్.. 14న స్పెషల్ సర్ప్రైజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News