Sirivennela Sitarama Sastry: ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత
Sirivennela: ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
Sirivennela Sitarama Sastry: ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Sitarama Sastry) తీవ్ర అస్వస్థత(Illness)కు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి(Kims Hospital)లో చేర్చినట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనకు కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం.
కొద్ది రోజులుగా సిరివెన్నెల న్యూమోనియా(Pneumonia)తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు సిరివెన్నెలను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ నటీనటులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు.
Also Read: KS Nageswara Rao: డైరెక్టర్ కె.ఎస్ నాగేశ్వరరావు మృతి.. శ్రీహరికి లైఫ్ ఇచ్చిందే ఈయనే..!
తెలుగు సినీ గీత రచయితల్లో సీతారామశాస్త్రి గారిది ప్రత్యేక స్థానం. ఆయన రాసిన ప్రతి పాట అణిముత్యమనే చెప్పాలి. సిరివెన్నెల, రుద్రవీణ, స్వయం కృషి, స్వర్ణకమలం, గాయం, చక్రం తదితర చిత్రాల్లో ఆయన రాసిన పాటలు ఎప్పుడూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. రుద్రవీణ(Rudraveena)లోని 'లలిత ప్రియ కమలం విరిసినదీ' పాటకు ఆయన జాతీయ అవార్డు(National Award) అందుకున్నారు. అదే విధంగా గాయం చిత్రంలోని 'నిగ్గ దీసి అడుగు' అనే గీతాన్ని స్వయంగా తానే రాసి..నటించారు. ఈ పాటకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురుస్కారం లభించింది. ఆయన ఉత్తమ గేయ రచయితగా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. శాస్తి గారి స్వస్థలం ఏపీలోని అనకాపల్లి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook