Telugu Movie Shooting Updates: తెలుగు సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి టాలీవుడ్ లో అనేక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయా సినిమాల షూటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? అనే వివరాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చూసేయండి. ముందుగా అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా షూటింగ్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ ప్రస్తుతానికి నానక్ రామ్ గూడలో జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమాకి సంబంధించి ఒక సాంగ్ సీక్వెన్స్ ప్రస్తుతానికి పోలీస్ అకాడమీలో షూటింగ్ జరుపుతున్నారు. ఇక మరోపక్క మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ కూడా షూటింగ్ జరుగుతోంది. ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న  సలార్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఈ రోజుతో పూర్తి కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  భోళా శంకర్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఈ రోజుతో పూర్తయింది.


మరో పక్క అల్యూమినియం ఫ్యాక్టరీలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న  డెవిల్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా విషయానికి వస్తే పోలీస్ అకాడమీలో ప్రస్తుతం ఒక సాంగ్ షూట్ జరుగుతోందని మరో రెండు పాటలు షూట్ చేస్తే సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోతుంది అని ప్రస్తుతానికి అత్తాపూర్ మాల్ లో కూడా ఒక సాంగ్ షూట్ చేయడానికి సినిమా యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలుస్తోంది ఇక ప్రస్తుతం పుష్పా సినిమా షూటింగ్ కూడా విశాఖపట్నంలో జరుగుతోంది. అల్లు అర్జున్ ఇటీవల విశాఖపట్నం వెళ్ళగా దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి దాదాపు అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతానికి మరిన్ని సినిమాలు కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.


Also Read: VSR vs WV Collections: మాంచి జోరు మీద వీరయ్య.. 41 కోట్ల తేడాతో వీర సింహ!


Also Read: Waltair Veerayya Day 10 Collections: పదో రోజు రచ్చ రేపిన చిరు.. నాన్ రాజమౌళి రికార్డు నమోదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook