Movies and Web series Releasing this week: 2022 సగానికి వచ్చేశాము, ఈ మొదటి సగభాగంలో పాన్‌ ఇండియా సినిమాలు, మోస్ట్ అవెయిటెడ్ సినిమాలు అన్నీ వచ్చేసి బాక్సాఫీస్‌ కొన్ని సత్తా చాతగా మరికొన్ని బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దమైనా థియేటర్ల టెన్షన్ వల్ల ఇంకా మోక్షం కోసం ఎదురు చూస్తున్న సినిమాలు అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నిజానికి జూన్ 24నే చాలా సినిమాలు విడుదల కావాల్సి ఉన్నా థియేటర్లు దొరక్క కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో జూలై మొదటి వారంలో అటు థియేటర్లో ఇటు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సినిమాల మీద ఒక లుక్కు వేద్దాం పదండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో పక్కా కమర్షియల్‌ ఒకటి. గోపిచంద్‌ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్ గా మారుతి తెరకెక్కించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, మూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు నిర్మించగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అలాగే ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ మూవీ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌'. మాధవన్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమాలో సిమ్రన్‌ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా జులై 1న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో  ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య, షారుఖ్‌లు అతిథి పాత్రల్లో నటించడంతో సినిమా మీద ఆసక్తి నెలకొంది. 


మరోపక్క అరుణ్‌విజయ్‌, ప్రియభవానీ శంకర్‌ జంటగా నటించిన మూవీ 'ఏనుగు'. సింగం ఫేమ్‌ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్‌ సతీష్‌కుమార్‌ నిర్మించారు. ఇక సందీప్‌ మాధవ్‌, గాయత్రి ఆర్‌.సురేష్‌ జంటగా నటించిన మూవీ 'గంధర్వ' యాంటీ ఏజింగ్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ముందుకు వస్తోంది.సాయికుమార్‌, సురేష్‌, బాబు మోహన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అఫ్సర్‌ దర్శకుడు. ఈ సినిమాని జులై 1న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత సురేష్‌ కొండేటి. ఇక ఈ సినిమాలు మాత్రమే కాక గరుడావెగా అంజి డైరెక్షన్లో తెరకెక్కిన ‘10 క్లాస్‌ డైరీస్‌’, ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘షికారు’ లాంటి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


ఇక ఓటీటీ విషయానికి వస్తే బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ కెరీర్‌లో అతి పెద్ద ఫడిజాస్టర్ ‘ధాకడ్‌’ జీ5 ఓటీటీలో జులై 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. రజనీష్‌ ఘయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ మూవీ ఓటీటీలో ఎలా అలరించనుంది అనేది చూడాలి. ఇక అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘సమ్రాట్‌ పృథ్వీరాజ్‌’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జులై 1  స్ట్రీమింగ్‌ కానుంది. ఇక బాహుబలి మేకర్ శోభు యార్లగడ్డ ఆర్కా మీడియా పతాకంపై నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’. రెజీనా, నివేదితా సతీష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్ జులై 1 నుంచి తెలుగు, తమిళంలో ఆహా ఓటీటీ వేదికలో ప్రసారం కానుంది. ఇవి కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ద టెర్మినల్‌ లిస్ట్‌ (తెలుగు డబ్బింగ్‌) జులై 1, నెట్ ఫ్లిక్స్ లో  బ్లాస్టెడ్‌ (హాలీవుడ్‌) జూన్‌ 28న,  స్ట్రేంజర్‌ థింగ్స్‌ 4 (వెబ్‌ సిరీస్‌) జులై 1న విడుదల అవుతున్నాయి. ఇక జీ 5లో షటప్‌ సోనా (హిందీ) జులై 1, ఎమెక్స్ ప్లేయర్లో మియా బీవీ ఔర్‌ మర్డర్‌ (హిందీ) జులై 1న, వూట్లో డియర్‌ విక్రమ్‌ (కన్నడ ) జూన్‌30న స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక డిస్నీ+హాట్ స్టార్లొ  ఓన్లీ మర్డర్స్‌ ఇన్‌ ది బిల్డింగ్‌ సీజన్‌2 కూడా జూన్‌ 28 స్ట్రీమింగ్ కానుంది. 


Also Read: Durex Wishes to Alia : ఇదేం వాడకంరా అయ్యా.. అలియా పెళ్ళికి అలా ఇప్పుడు ఇలా


Also Read: Samantha New Item Song: సమంత మరో క్రేజీ ఐటం సాంగ్.. ఇక రచ్చ రచ్చే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.