Telugu News Anchor Death:
ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గుండెపోతుతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. శాంతి స్వరూప్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులే. ఆయన తెలుగులో వార్తలు చదివిన తొలి యాంకర్ కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికీ తెలుగు న్యూస్ రీడర్లు ఎంతోమందికి ఆయన గురువు. 1978లో న్యూస్ చదవడానికి జాబ్లో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. 2011లో ఆయన పదవి విరమణ చేశారు.


మూడు దశాబ్దాల క్రితం మనకు కనీసం టెలీ ప్రాంప్టర్ కూడా లేదు. అందువల్లనే అప్పట్లో స్క్రిప్ట్ పేపర్లనే బట్టీ పట్టి మరి వార్తలు చెప్పేవారు శాంతి స్వరూప్. ఆయన వార్తలు చదవడం ప్రారంభించిన 10 సంవత్సరాల పాటు అదే పరిస్థితి. “టెలీ ప్రాంప్టర్ లేదు.. తప్పులు జరగకుండా చాలా బట్టీ పట్టి వార్తలు చదివే వాడిని.. మిగిలిన వారు అందరూ భయపడ్డారు ఎక్కడ తప్పులు చదువుతానోనని” అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చారు శాంతి స్వరూప్ గారు.


వార్తలే కాదు ఆయన మంచి రచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన నవల భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద రాసిన రాతిమేఘం అనే నవల ఎంతో పేరు తెచ్చుకునింది. ఆ తరువాత క్రికెట్ పైన క్రేజ్ అనే నవల.. సతీసహగమనాన్ని వ్యతిరేకిస్తూ అర్ధాగ్ని అనే నవలలు రచించారు శాంతి స్వరూప్.



 హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత... పెంచి పెద్దచేసిన అన్నయ్య మరణించడంతో అప్పట్లో కుటుంబ బాధ్యతలు అన్ని ఆయన పైనే పడ్డాయి. ఆ తరువాత ఎన్నో కష్టాలు పడి మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న శాంతిస్వరూ 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిద్దరూ ఐ ఐ టీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. 


కాగా ఇలా యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన మరణ వార్త ప్రస్తుతం తెలుగు వారిని కదిలిస్తోంది. ఎంతోమంది సోషల్ మీడియా వేడుకగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.


Also Read: YS Jagan: మళ్లీ ముఖ్యమంత్రి అవుతా.. వలంటీర్‌ వ్యవస్థపైనే తొలి సంతకం చేస్తా: వైఎస్‌ జగన్‌


Also Read: Amanchi Krishna Mohan: వైఎస్ జగన్‌కు భారీ షాక్‌.. వైసీపీకి ఆమంచి కృష్ణ మోహన్‌ రాజీనామా


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook