Tesla Cars Light Show on Naatu Naatu Song: ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న సాంగ్ ఏదైనా ఉందా అంటే అది హాలీవుడ్ ఆల్బం కాదు.. ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ అసలే కాదు.. మన ఇండియా నుంచి ఆస్కార్స్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీపడి అవార్డ్ సొంతం చేసుకున్న నాటు నాటు పాటనే ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.. ఉర్రూతలూగిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి మొదలుకుని బిజినెస్ మేన్ల వరకు.. క్రీడా ప్రముఖుల నుంచి మొదలుకుని రాజకీయ ప్రముఖుల వరకు.. అందరి హృదయాలను గెల్చుకున్న ఈ నాటు నాటు పాటపై సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాటు నాటు సాంగ్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, సెలబ్రిటీలు పోస్ట్ చేస్తోన్న వీడియోలు చూస్తే.. ఒకదానిని మించిన వీడియో మరొకటి అన్నట్టుగా ఉంటున్నాయి. తాజాగా నాటు నాటు సాంగ్‌పై టెస్లా కార్లను ఉపయోగించి చేసిన లైట్ షో వీడియో కూడా అలాంటిదే. నాటు నాటు సాంగ్ బీట్స్‌కి, మ్యూజిక్‌కి అనుగుణంగా కార్ల లైట్స్, ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ చేస్తూ చేసిన టెస్లా కార్ల లైట్ షో వీడియో
చూస్తే.. వారెవ్వా.. తెలుగు సాంగ్‌కి ఎంత క్రేజ్ వచ్చింది అనేలా ఉంది. 


ఈ లైటింగ్ షో కోసం కొన్ని వందల సంఖ్యలో టెస్లా కార్లను ఉపయోగించినట్టు వీడియో చూస్తే అర్ణమవుతోంది. న్యూ జెర్సీ లాంటి గ్లోబల్ సిటీలో ఈ వీడియోను షూట్ చేశారు. ఆ వీడియో చూస్తే అమేజింగ్ అని అనిపించకమానదు. చెప్పడం ఎందుకు కానీ నమ్మలేకపోతే మీరే ఈ వీడియో చూసేయండి.



ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఆర్ఆర్ఆర్ మూవీ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేయగా.. వీడియో పోస్ట్ చేసిన ఏడెనిమిది గంటల్లోనే 22.5 లక్షలకుపైగా లైక్స్ సొంతం చేసుకుంది. ట్విటర్ యూజర్స్ ఈ వీడియోకు సాహో అంటున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఒక తెలుగు పాటకు లభించిన ఈ ఆధరణ, క్రేజ్ అద్భుతం.. అత్యద్భుతం అని కామెంట్స్ రూపంలో కితాబిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ వీడియోల్లో ఈ టెస్లా కార్ల లైట్ షో వీడియో కూడా ఒకటి. టెస్లా కార్ల యజమాని, ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్‌ని కూడా ఈ వీడియోలో ట్యాగ్ చేయడం చూడొచ్చు.


ఇది కూడా చదవండి : Nagababu Emotional: నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది.. నాగబాబు ఎమోషనల్!


ఇది కూడా చదవండి : Alekhya Reddy Emotional Post: బంగారు బాలయ్య పేరుకు మీరే అర్హులు.. ఎలా థాంక్స్ చెప్పాలో అర్ధం కావడం లేదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook