TFJA (Tollywood Film Journalist Association):  అవును ఈ మధ్య కాలంలో భావ ప్రకటన పేరుతో  సోషల్ మీడియాలో ఎవరు ఇష్టమొచ్చినట్టు వాళ్లు ఎలా పడితే అలా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒకపుడు సోషల్ మీడియా వేదికగా ఎవ్వరు చెప్పని నిజాలు వెలుగులోకి వచ్చేవి. కానీ కత్తికి రెండు వైపులా పదును అన్నట్టు మరికొంత మంది స్వార్ధపరులు ఎంత ప్రయోజనకారి అయిన సోషల్ మీడియాను తమ వ్యక్తిగత స్వార్ధం కోసం దాన్ని ఇష్టమొచ్చినట్టు.. తమకు తోచిన విధంగా వాడేస్తున్నారు. అలాంటి తప్పుడు కథనాలు రాసి ప్రసారం చేసే వారిపై TFJA కఠిన చర్యలకు దిగుతోంది. టాలీవుడ్ సినీ పరిశ్రమలో సామాజిక మాధ్యమాల వేదికగా కొంత మంది వ్యక్తులు పనికట్టుకొని మీడియాలో విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన దుర్భాషలు.. ధూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని టార్గెట్‌ చేస్తున్నారు. అంతేకాదు వారిని మానసికంగా తమ రాతలతో కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీళ్ల రాతలకు ఎంతో మంది నిర్మాతలు.. దర్శకులు.. హీరోలు బాధింపబడ్డారు. అందుకే తెలుగు ఫిలిమ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టి.ఎఫ్‌.జె.ఎ) ప్రెసిడెంట్‌ వి.లక్ష్మీనారాయణ, జనరల్‌ సెక్రటరీ వై.జె రాంబాబులు  తమ అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌లోని (టి.ఎఫ్‌.డి.ఎ) ప్రెసిడెంట్‌ ప్రేమ, ట్రెజరర్‌ శివమల్లాలతో కలిసి డిజిపి రవిగుప్తా, హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిలను కలిసి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై విషం కక్కుతున్న కొన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ఫ్లాట్‌పామ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు.


చిత్ర పరిశ్రమలో ఉన్న గడ్డు పరిస్థితిని విన్న పోలీస్ ఉన్నతాధికారులు.. నిజంగానే కొన్నివార్తలు మా దృష్టికి వచ్చాయని మీరు కూడా కరెక్ట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌తో ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిస్తే సోషల్‌ మీడియాని వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌ల్లో  విచ్చలవిడి రాతలు రాసే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా (టి.ఎఫ్‌.జె.ఎ),  (టి.ఎఫ్‌.డి.ఎ)  అసోసియేషన్‌లో జరిగే మంచి పనులను ఎలా చేస్తున్నామో వివరించారు మీడియా ప్రతినిధులు. మరో రెండు మూడు రోజుల్లో రూమర్లు పుట్టించి తమ పబ్బం గడుపుకునే వారిని పట్టుకుని విచారిస్తామని హామి ఇచ్చారు. మరో రెండు రోజుల్లో పోలీస్‌ ప్రతినిధులతో కీలకమై సమావేశాన్ని నిర్వహించనున్నారు యూనియన్‌ ప్రతినిధులు.


Also Read: Harish Rao: చీము నెత్తురు ఉన్నోళ్లు ఎవరూ కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేయరు: హరీశ్ రావు వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter