Thala Ajith Father Subramaniam Passes Away కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్‌కు పితృ వియోగం కలిగింది. అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో నేటి ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి వయోభారంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. తండ్రి మరణంతో కుంగిపోయిన అజిత్‌కు కోలీవుడ్ సంతాపాన్ని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనారోగ్య సమస్యలతోనే నేటి ఉదయం ఆయన కన్నుమూశారు. కానీ మరణానికి సంబంధించిన కారణం ఏంటన్నది ఇంత వరకు బయటకు చెప్పలేదు. చెన్నైలోని బసంత్ నగర్‌లోని స్మశాన వాటికలో ఆయన అంతమి సంస్కారాలు జరగనున్నాయి. అజిత్‌ తండ్రి మరణించడంతో సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.


అజిత్ కుమార్ చివరగా తునివు (తెలుగులో తెగింపు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. తెలుగులోనూ ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అజిత్ మరో యాక్షన్ సినిమాతో రెడీ అవుతున్నాడు. అజిత్ తన ఫ్యామిలీని సోషల్ మీడియాకు, మీడియాకు దూరంగా ఉంచుతాడన్న సంగతి తెలిసిందే. అందుకే అజిత్ ఫ్యామిలీ విషయాలు ఎక్కువగా బయటకు రావు.


మా తండ్రి పీ.ఎస్ మణి (85) నేటి తెల్లవారుఝామున కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నేను కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా ఆయనకు చికిత్స అందిస్తూనే ఉన్నాం. ఆరు దశాబ్దాలకు పైగా మా తల్లిదండ్రులు అన్యోన్యంగా బతికారు. మా తండ్రి గారు మరణించారని తెలిసి.. ఎంతో మంది సంతాపం తెలిపారు. సందేశాలు పంపుతూనే ఉన్నారు. వారందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన అంత్యక్రియలు మా కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరపాలని అనుకుంటున్నాం. ఇది మా కుటుంబానికి వ్యక్తిగత విషయమని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అంటూ ఓ అఫీషియల్ నోట్ విడుదల చేశారు.
 


Also Read:  Prabhas Salaar : పాటలు, కామెడీ లేకుండానే విడుదల.. సలార్ మేకర్ల నిర్ణయం కరెక్టే!


Also Read: Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook