Thalapathy Vijay apology to voters: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్టార్ హీరో విజయ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నై నీలంకరైలోని ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అయితే విజయ్ పోలింగ్ బూత్‌లో ఉన్న సమయంలో అభిమానులు, మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. తన రాకతో కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విజయ్ ఓటర్లకు క్షమాపణలు చెప్పారు. విజయ్ చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖానికి మాస్కు ధరించి సింపుల్ బ్రౌన్ షర్ట్, బ్లూ జీన్స్‌లో విజయ్ పోలింగ్ బూత్‌కి వచ్చారు. అందరి లాగే విజయ్ కూడా ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో నిలబడ్డారు. అయితే విజయ్ పోలింగ్ బూత్‌కి వచ్చాడని తెలియగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ అక్కడ గుమిగూడారు. ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అధికారులు ఆయన్ను నేరుగా వచ్చి ఓటు వేయాలని... క్యూ లైన్‌లో నిలుచుంటే మరింత మంది జనం గుమిగూడుతారని చెప్పినట్లు తెలుస్తోంది. అధికారుల సూచన మేరకు విజయ్ నేరుగా వెళ్లి ఓటు వేసినట్లు సమాచారం.



అప్పటికే ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బందిపడ్డారు. దీంతో పోలింగ్ బూత్‌ నుంచి బయటకొచ్చేటప్పుడు ఓటర్లకు ఆయన చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. అనంతరం తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.


కాగా, తమిళనాడులోని 490 పంచాయతీలు, 138 మున్సిపాలిటీలు, 21 కార్పోరేషన్లకు శనివారం (ఫిబ్రవరి 19) ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ఈ నెల 22న జరగనుంది. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ ప్రధాన పోటీ డీఎంకె, అన్నాడీఎంకె మధ్యే నెలకొంది. అటు బీజేపీ సైతం కొద్దో గొప్పో సీట్లు రాబట్టుకునేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. 



Also Read: IPL 2022: ఐపీఎల్​ 2022 కోసం ఆరు వేదికలు ఫిక్స్​- ఫైనల్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో!


Also read: IND vs WI: మెరిసిన కోహ్లీ, భువీ.. రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం! సిరీస్ కైవసం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook