IPL 2022: ఐపీఎల్​ 2022 కోసం ఆరు వేదికలు ఫిక్స్​- ఫైనల్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో!

IPL 2022: ఐపీఎల్​ 2022ను మార్చి ఆఖరు నుంచి నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐ మొత్తం 6 స్డేడియాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 05:30 PM IST
  • ఐపీఎవ్​ 2022పై బీసీసీఐ కసరత్తు ముమ్మరం
  • వచ్చే నెలాఖరు నుంచి నిర్వహించే అవకాశం
  • ఇప్పటికే స్టేడియంలో ఎంపిక పూర్తయినట్లు సమాచారం
IPL 2022: ఐపీఎల్​ 2022 కోసం ఆరు వేదికలు ఫిక్స్​- ఫైనల్స్ నరేంద్ర మోదీ స్టేడియంలో!

IPL 2022: ఐపీఎల్​ 2022 వేలం గత వారం ముగియగా.. ఇప్పుడు 15వ సీజన్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొత్తం ఐపీఎల్​ నిర్వహణ కోసం ఆరు స్టేడియాలను మాత్రమే ఎంపిక చేసినట్లు సమాచారం. కరోనా మహమ్మారి సోకేందుకు అవకాశమున్న నేపథ్యంలో ప్లేయర్స్​ను సురక్షితంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

అయితే మొత్తం ఆరు స్టేడియాల్లో ముంబయిలోనే ఐదు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరో స్టేడియంగా గుజరాత్​ అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంను ఐపీఎల్​ 2022కోసం బీసీసీఐ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

నరేంద్ర మోదీ స్టేడియం ప్లేఆఫ్స్​తో పాటు ఫైనల్​ మ్యాచ్​కు వేదిక కానుందని తెలుస్తోంది.

వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డాక్టర్ డి.వై.పాటిల్​ స్పోర్ట్స్​ స్టేడియం, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​ స్టేడియం, జియో స్డేడియం (నావి ముంబయి) లను ముంబయిలో బీసీసీఐ ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఐపీఎల్ 2022 గురించి..

గత సీజన్లతో పోలిస్తే.. ఈ సారి ఐపీఎల్​కు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ సారి ఐపీఎల్​లో మొత్తం 10 టీమ్స్​ పాల్గొననున్నాయి. దీనితో సీజన్​ మొత్తం మీద 74 మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇక రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో దేశీయంగా ఐపీఎల్​ మ్యాచ్​లు జరగనున్నాయి. కరోనా కారణంగా యూఏఈ వేదికగా ఐపీఎల్​ 2020ని నిర్వహించింది బీసీసీఐ. ఆ తర్వాత 2021లో ఐపీఎల్​ను దేశీయంగా నిర్వహించేందుకు ప్రయత్నించింది. లీగ్​ దశలో కొన్ని మ్యాచ్​లు దేశీయంగానే జరిగాయి. అయితే కొంత మంది ప్లేయర్స్​ కరోనా బారిన పడటంతో.. కొన్ని నెలల తర్వాత యూఏఈ వేదికగానే ఐపీఎల్​ 2021 పూర్తయింది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కట్టుదిట్టమైన బయోబబుల్ నిబంధనల నడుమ దేశీయంగానే ఐపీఎల్ 2022 నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దేశీయంగానే ఐపీఎల్ 2022 ఉంటుందని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ.. ఇతర విషయాలపై మాత్రం ఇంకా స్పందించలేదు.

ఆ సారి ఐపీఎల్​ మార్చి 27 నుంచి 28 వరకు జరిగే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

Also read: Virat Kohli Break: విరాట్​ కోహ్లీకి బ్రేక్​- వెస్డిండీస్​తో మూడో టీ20కి దూరం..!

Also read: IND vs WI: మెరిసిన కోహ్లీ, భువీ.. రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం! సిరీస్ కైవసం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News