The Ghost Thamahagane Word Meaning: ‘తమ హగనే’ అంటే అర్థం ఇదే.. అసలు విషయం బయట పెట్టేసిన ది ఘోస్ట్ టీమ్!
Thamahagane Word Meaning Revealed from The Ghost Movie: తమ హగనే అనే పదంతో సినిమా మీద ఆసక్తి పెంచేసిన ది ఘోస్ట్ మూవీ టీమ్ ఇప్పుడు ఆ పదం అర్ధం ఏమిటో క్లారిటీ ఇచ్చేసింది. ఆ వివరాలు
Thamahagane Word Meaning Revealed from The Ghost Movie: చివరిగా బంగార్రాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగార్జున ఇప్పుడు ది ఘోస్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేశారు సినిమా యూనిట్.
అయితే ‘తమ హగనే’ అంటూ గత కొద్దిరోజులుగా ఈ సినిమా యూనిట్ సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా ప్రయత్నాలు చేసింది. అసలు ఈ ఘోస్ట్ సినిమాకు ఈ తమ హగనే అనే అనే పదానికి సంబంధం ఏమిటి? ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆ పదం ఎందుకు వాడుతున్నారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ ది ఘోస్ట్ సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. తమ హగనే అనే అంటే అర్థం ఏమిటో అనే విషయం మీద పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.
నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ విషయం మీద క్లారిటీ ఇస్తూ ఈ తమ హగనే అనే పదానికి కూడా అర్థం చెప్పేశారు. తమ హగనే అంటే విలువైన ఉక్కు అని అర్థం చెబుతూ ది ఘోస్ట్ టీం ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో నాగార్జున ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి ఆయనను తుదముట్టించడానికి అండర్ వరల్డ్ మొత్తం అక్కడికి చేరుకున్నట్లు చూపించారు. ఇక అండర్ వరల్డ్ తనపై దాడి చేయబోతున్నారని విషయం తెలిసిన నాగార్జున తన వద్ద ఉన్న విలువైన ఉక్కుతో చేసిన కత్తిని సిద్ధం చేసి యుద్ధానికి సై అన్నట్లు కనిపిస్తారు. అలా రెండు నిమిషాల ఈ వీడియో సినిమా మీద ఆసక్తి పెంచేసింది. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది అలాగే నాగార్జున సినిమా మీద మరింత క్రేజ్ పెంచేస్తోంది. ఇక ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.. అలాగే శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల మీద సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సరికొత్త లుక్ లో మాత్రం నాగార్జున అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు అని చెప్పక తప్పదు.
Also Read: Karthikeya 2 Craze in Hindi: హిందీలో కార్తికేయ 2కి బ్రహ్మరధం.. 50 షోలతో మొదలై 3000 దాకా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి