Thangalaan Total Box Office Closing Collections: చియాన్ విక్రమ్ మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన  ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాల తర్వాత యాక్ట్ చేసిన చిత్రం ‘తంగలాన్’. ఈ మూవీ కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.  ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్  డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముందు నుంచి ఓ మోస్తరు టాక్ వచ్చింది. పైగా అర్ధం పర్థం లేని  ఓ మతానికి వ్యతిరేకంగా తెరకెక్కించారనే కామెంట్స్ కూడా వినిపడ్డాయి. మొత్తంగా ఈ సినిమా టెక్నికల్ గా బాగున్నా.. కథ పరంగా ఈ సినిమా వీక్ ఉందనే టాక్ వినిపించింది.
 
"తంగలాన్" సినిమాలో చియాన్ విక్రమ్ సరసన పార్వతీ తిరువోతు, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటించారు.   కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో బ్రిటిష్ కాలంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెబుతున్నా.. దర్శకుడు ఈ సినిమాను వాస్తవ విరుద్ధంగా తెరకెక్కించినట్టు కొంత మంది చరిత్ర కారులు పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మొత్తంగా ఈ సినిమా క్లోజింగ్ కలెక్సన్ విషయానికొస్తే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో ఈ సినిమా రూ. 37.90 కోట్ల గ్రాస్..
తెలుగు రాష్ట్రాలు.. రూ. 9.30 కోట్ల గ్రాస్..
కర్ణాటక.. రూ. 4.50 కోట్ల గ్రాస్..
కేరళ.. రూ. 3.25 కోట్ల గ్రాస్..
రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 0.90 కోట్లు..
ఓవర్సీస్.. రూ. 16.90 కోట్ల గ్రాస్..
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 72.75 కోట్ల గ్రాస్.. (రూ. 34.55 కోట్ల షేర్) రాబట్టింది.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!



ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.55 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం థియేట్రికల్ గా రూ. 34 కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చింది.


తంగలాన్ సినిమాలో బంగారం వేటలో రెండు తెగల మధ్య వార్ నేపథ్యంలో తెరకెక్కింది.  తన తెగ వారిని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా వెనకడుగు వేయని నాయకుడి పాత్రలో  విక్రమ్ నటించారు.ఈ పాత్రలో విక్రమ్ ఒదిగిపోయిన తీరు ప్రశంసనీయం అన్నారు. మొత్తంగా ఈ సినిమా కోసం విక్రమ్ సరికొత్తగా ఒదిగిపోయినా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రాబట్టలేకపోయింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter