Naga Chaitanya, Raashi Khanna starrer Thank You Movie Trailer out: టాలీవుడ్ యువ హీరో నాగ‌ చైత‌న్య ప్ర‌స్తుతం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్నాడు. రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన‌ సాంగ్స్, టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. థ్యాంక్యూ సినిమా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా జులై 22న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యకమాలను వేగవంతం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థ్యాంక్యూ సినిమా ట్రైలర్‌ను ఈరోజు చిత్ర బృందం విడుదల చేసింది. రెండు నిమిషాల రెండు సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్‌.. మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరిన గమ్యానికి విలువుండదు అని నా ఫ్రెండ్ చెప్పాడు' అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. అయ్యిరా.. ఎక్కడరా, నాకు మంచు అయినా.. రంగుల రాట్నం అయినా బాగా ఇష్టం,  ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమ ఎంతో గొప్పది అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 


విభిన్న ప్రేమ కథతో థ్యాంక్యూ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కొన్ని సంభాషణలు హృదయాల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. చై నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయని చెప్పొచ్చు. థ్యాంక్యూ చిత్రంలో చైత‌న్య డిఫ‌రెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు అభిమానిగా చైతూ క‌నిపించ‌బోతున్నాడ‌ట. స్కూల్ డేస్‌లో మ‌హేశ్ అభిమానిగా క‌నిపించ‌నున్నాడ‌ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



థ్యాంక్యూ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. బీవీఎస్ ర‌వి క‌థ‌నందించగా.. లెజెండ‌రీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ వ‌ర్క్ చేస్తున్నాడు. సూపర్‌హిట్‌ చిత్రం మనం తర్వాత విక్రమ్‌, చైతన్య కాంబినేషన్‌లో వస్తుండటంతో.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 


Also Read: మహిళకు ముద్దులు, హగ్గులు ఇచ్చిన రెండు సింహాలు.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!  


Also Read: Revanth Reddy: కమలంలో రేవంత్ రెడ్డి కలకలం.. గజ్వేల్ లో ఈటల పోటీ చేసేది బీజేపీ నుంచి కాదా?


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook