Revanth Reddy: కమలంలో రేవంత్ రెడ్డి కలకలం.. గజ్వేల్ లో ఈటల పోటీ చేసేది బీజేపీ నుంచి కాదా?

Revanth Reddy: ముందస్తు ఎన్నికల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం కాక రేపుతోంది.

Written by - Srisailam | Last Updated : Jul 12, 2022, 06:06 PM IST
  • బీజేపీలో రేవంత్ రెడ్డి కలకలం
  • ఈటల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారోనన్న రేవంత్
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం
Revanth Reddy: కమలంలో రేవంత్ రెడ్డి కలకలం.. గజ్వేల్ లో ఈటల పోటీ చేసేది బీజేపీ నుంచి కాదా?

Revanth Reddy: ముందస్తు ఎన్నికల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడం కాక రేపుతోంది. గజ్వేల్ లో పోటీ చేయడమే కాదు పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సువేందు అధికారి ఓడించినట్లుగానే తాను కేసీఆర్ ను ఓడించి తీరుతానని చెప్పారు. గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల ప్రకటించడంతో ఫోకస్ అంతా అటువైపే మళ్లింది. తెలంగాణలో బెంగాల్ తరహాలో బీజేపీ పోరాడబోతుందనే సంకేతం వచ్చింది. అదే సమయంలో కేసీఆర్ ను నేరుగా ఢీకొట్టాలన్న నిర్ణయంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి ప్రత్యర్థి  బీజేపీయేనా అన్న చర్చ మొదలైంది.

కేసీఆర్ పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటనతో కమలం పార్టీకి బూస్ట్ ఇచ్చింది. ఇంతలోనే గజ్వేల్ సీన్ లోకి ఎంటరయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రేసులో తాము వెనకబడలేదనే సంకేతం వచ్చేనా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కమలం పార్టీని డిఫెన్స్ లో పడేశారు. గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ అభ్యర్థే ఓడిస్తారని చెప్పారు. ఈటల రాజేందర్ పోటీపై స్పందించిన రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు కాని ఏ పార్టీ నుంచో చెప్పలేదంటూ బాంబ్ పేల్చారు. ఈటల రాజేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారగా.. కమలం పార్టీలో కలకలం రేపాయి.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో గజ్వేల్ లో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ కాకుంటే మరీ ఈటల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. హుజురాబాద్ లో సంచలన విజయం సాధించి కేసీఆర్ కు  దిమ్మతిరిగే షాకిచ్చిన ఈటల రాజేందర్ కు బీజేపీలో సరైన గుర్తింపు దక్కడం లేదనే టాక్ వస్తోంది. ఈటల అసంతృప్తిగా ఉన్నారని తెలిసే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా అమిత్ షా ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారని తెలుస్తోంది. ఆ తర్వాతే చేరికల కమిటి కన్వీనర్ గా ఈటలను నియమించారు. అయితే చేరికల కమిటి కన్వీనర్ పదవిపై ఈటల సంతృప్తిగా లేరని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి సాయం చేశారని.. కావాలనే కాంగ్రెస్ తరపున డమ్మీ అభ్యర్థిని పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు కాంగ్రెస్ నేతలే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హుజురాబాద్ లో బీజేపీ నుంచి గెలిచినా.. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజేందర్ కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

గజ్వేల్ ఎన్నికకు సంబంధించి రేవంత్ రెడ్డి కామెంట్లపై కమలం పార్టీలోనూ చర్చ సాగుతుందోని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎందుకలా మాట్లాడారు.. ఈటల రాజేందర్ రూట్ మారుస్తున్నారా అన్న అంశాలపై బీజేపీ పెద్దలు చర్చించారని చెబుతున్నారు. సంచలనం కోసమే  రేవంత్ రెడ్డి అలా మాట్లాడారని.. ఈటల ప్రకటనతో బీజేపీకి జోష్ వచ్చిందని.. దాన్ని పక్కదారి పట్టించేందుకే ఈటల విషయంలో కామెంట్ చేశారని బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈటల రాజేందర్ కు బీజేపీ పెద్దల ఆశిస్సులు ఉన్నాయని,, రాబోయే రోజుల్లో ఆయన కీలక పదవి రాబోతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ కమలనాధులు అంటున్నారు. మొత్తంగా గజ్వేల్ లో ఈటల పోటీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలే స్పష్టించాయి. 

Read also: Employees Salarys: రెండు వారాలైనా ఉద్యోగులకు నో జీతం.. బంగారు తెలంగాణలో కొత్త అప్పు పుడితేనే మోక్షం  

Read also: Telangana EAMCET: తెలంగాణలో తగ్గని భారీ వర్షాలు.. ఎంసెట్ వాయిదా యోచనలో సర్కార్   

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News