The Family Star Trolls: ఓటీటీలో విజయ్ దేవరకొండ `ది ఫ్యామిలీ స్టార్` మూవీపై దారుణమైన ట్రోల్స్..
The Family Star Trolls: విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన సినిమా `ది ఫ్యామిలీ స్టార్`. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్‌లో ఈ సినిమా చూడని ప్రేక్షకులు తాజాగా ఈ మూవీ చూసి దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.
The Family Star Trolls: ఈ మధ్యకాలంలో బడా హీరోల సినిమాలు ఫ్లాప్ టాక్ వస్తే చాలు.. ప్రేక్షకులు థియేటర్స్ ముఖాలు చూడటం లేదు. తాజాగా థియేట్రికల్‌గా ఫెయిల్ అయిన ఈ సినిమా ఇపుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలోని సీన్స్ పై నెటిజన్స్ కొందరు దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలోని రవిబాబుకు వాడి ఏరియాలోకి వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ పై మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ స్టార్టింగ్‌లో పిల్లలకు దోశలు వేసే సీన్స్ మరి దారుణంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత మిడిల్ క్లాస్ అయినా.. అడుక్కుతినే వాడైనా అలాంటి దోశలు వేసుకోరని చెబుతున్నారు. ఎవరైనా బండిలో పెట్రోలు.. రూ. 20 కొట్టించినా.. ఎంత దూరం వస్తుందో చెప్పలేము. మిడిల్ క్లాస్ అయినంత మాత్రానా.. మరి సినిమాలో చూపించినంత ఉండరంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
మొత్తంగా సినిమాలో మిడిల్ క్లాస్ అంటూ హై క్లాస్ వాడిగా చూపించడం పై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ విషయానికొస్తే..ఈ సినిమా తొలిరోజు కనీస ఓపెనింగ్స్ రాబట్టలేక కుదేలై విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌కు పెద్ద పరీక్ష పెట్టింది. థియేట్రికల్‌గా విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా 'ధి ఫ్యామిలీ స్టార్' మూవీ నిలిచింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ఈ నెల 26 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏప్రిల్ 5వ తేదీన రిలీజైన "ఫ్యామిలీ స్టార్" సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫ్యామిలీ ఆడియన్స్‌కు అట్రాక్ట్ చేయడంతో విఫలమైంది. సినిమా స్టోరీ బాగున్నా.. అది ప్రేక్షకులకు డేలీ సీరియల్ చూసిన ఫీలింగ్ రావడంతో ఈ సినిమాను ఆడియన్స్ తిరస్కరించారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, మృణాల్ సేన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి బాగానే ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. 'ది ఫ్యామిలీ స్టార్' మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. మొత్తంగా థియేట్రికల్‌గా ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇక ఈ సినిమాను ఓటీటీ వేదికగా చూస్తు.. ఈ సినిమాలోని పలు సన్నివేశాలపై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి