The Ghost Movie is not postponing and set to release on october 5th: ఇప్పటికే తెలుగు నుంచి రావాల్సిన పెద్ద సినిమాలన్నీ విడుదలయ్యాయి.  ఇక పలు ఆసక్తికరమైన పెద్ద హీరోల సినిమాలు కూడా విడుదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా వాయిదా పడి డిసెంబర్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగితే అదేమీ లేదని సినిమా నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక అదే రోజు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా విడుదలవుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అసలే సినిమా హిట్ అవడం అనేది చాలా అపురూపమైన విషయంగా మారిపోయింది. ఆగస్టు నెలలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు సందడి చేశాయి కానీ సెప్టెంబర్ నెలలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. అక్టోబర్లో ఏదైనా సినిమా బాగుంటే దానికి మంచి కలెక్షన్స్ వస్తాయి అని భావిస్తున్నారు. ఇలా రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలైతే ఇబ్బందని భావించి ది ఘోస్ట్ సినిమా నిర్మాతలు సినిమా వాయిదా వేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.


అయితే తాజాగా ఈ విషయం మీద ఘోస్ట్ సినిమా నిర్మాత ఏషియన్ సునీల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ సినిమా వాయిదా వేయడం లేదని మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ సినిమా కోసం తమ సినిమా వాయిదా వేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి - నాగార్జున మధ్య మంచి స్నేహబంధం ఉండడంతో మీ సినిమా వాయిదా వేసుకోమని మెగాస్టార్ చిరంజీవి కోరడంతో నాగార్జున అందుకు ఒప్పుకున్నాడనే ప్రచారం జరుగుతుంది.


కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఏసియన్ సునీల్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ నాగార్జున, ది ఘోస్ట్ సినిమాలు దసరా బరిలో దిగబోతున్నాయి. ఇవి కాక మరికొన్ని చిన్న సినిమాలు కూడా దసరా బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.


ది ఘోస్ట్ సినిమాకు ప్రవీణ్ సత్తార్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున చేస్తున్న సినిమా డైరెక్ట్ మూవీ కాగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమా మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు రీమేక్. ఇక ఈ రెండు సినిమాల మీద ప్రేక్షకుల్లో అయితే మంచి అంచనాలు ఉన్నాయి. మరి రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
Also Read: Krishnam Raju Assets: వందల ఎకరాలు.. ఇళ్లు, బంగ్లాలు.. కృష్ణంరాజు ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?


Also Read: Tollywood Heros Remakes: తెలుగులో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరోలు ఎవరో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి