Krishnam Raju Assets: వందల ఎకరాలు.. ఇళ్లు, బంగ్లాలు.. కృష్ణంరాజు ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Krishnam Raju Net Worth - Krishnam Raju Assets Details: రెబల్ స్టార్ కృష్ణంరాజు పూర్వీకుల నుంచి ఆయనకు వందల ఎకరాలు ఆస్తులు వచ్చాయి. ఇవి కాక ఆయన సినీ పరిశ్రమ ద్వారా కొన్ని వందల కోట్లు కూడబెట్టారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 13, 2022, 02:40 PM IST
Krishnam Raju Assets: వందల ఎకరాలు.. ఇళ్లు, బంగ్లాలు.. కృష్ణంరాజు ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Krishnam Raju Net Worth - Krishnam Raju Assets Details: రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 11 2022 ఉదయం తెల్లవారుజామున మూడు గంటలు 25 నిమిషాలకు కన్నుమూశారు. తన కెరీర్ ను ఒక నటుడిగా ప్రారంభించిన ఆయన హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 190 సినిమాల్లో నటించారు. 1940వ సంవత్సరంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు.

నిజానికి కృష్ణంరాజు తండ్రి స్వస్థలం రాజమండ్రి దగ్గర అయినా తన మేనత్తను వివాహం చేసిన మొగల్తూరుకే తన తండ్రి, ఆయన సోదరులందరూ వచ్చేశారని కృష్ణంరాజు గతంలో వెల్లడించారు. కృష్ణంరాజుకు తన తండ్రి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి వచ్చింది. ఇప్పటికి ఆ భూముల వ్యవసాయ నిర్వహణ మొత్తం మొగల్తూరులోని కృష్ణంరాజు సమీప బంధువులు చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట ఒక రాజభవనం లాంటి భవనం కూడా ఉంది.

ఇవి కాక సినీ పరిశ్రమ మొదట్లో చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ నివాసం ఉండేందుకు పలు ఆస్తులు కొనుగోలు చేశారు. తర్వాత సినీ పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా కృష్ణంరాజు ఇక్కడ కూడా ఖరీదైన పలు నివాస భవనాలు కొనుగోలు చేశారు. చనిపోయే నాటికి ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో బస చేస్తున్నారు. దాని ఖరీదు సుమారు 18 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇక ఇవి కాకుండా హైదరాబాదులో ఆయనకు పలు వ్యాపార సముదాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే తన చివరి రోజుల్లో గడిపేందుకు ఆయన మొయినాబాద్ దగ్గరలోని కనక మామిడి దగ్గరలో ఒక ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. అక్కడే ఆయన అంత్యక్రియలు జరిపారు. ఇక కృష్ణంరాజు కార్ల విషయానికి వస్తే ఆయనకు 90 లక్షల విలువైన బెంజ్, 40 లక్షల ఫార్చునర్, 90 లక్షల విలువైన వోల్వో కార్లు ఉన్నాయి. కృష్ణంరాజుది క్షత్రియ కుటుంబం కావడంతో ఇంటికి వచ్చిన వారిని భోజనం చేయకుండా పంపించేవారు కాదు. అందుకే ప్రతినిత్యం కృష్ణంరాజు గారి ఇంట్లో ఒక పెళ్లి వేడుకకు సిద్ధం చేసినట్లు అన్ని సిద్ధం చేస్తూ ఉంటారట.

ఎవరైనా సరే తన ఇంటికి వస్తే అన్నం తినకుండా మాత్రం వెనక్కి పంపించే ప్రసక్తే ఉండేది కాదట. అలాగే కృష్ణంరాజు మొదట సీతాదేవి అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. అయితే ఆమె అనారోగ్య కారణాలతో కన్నుమూయడంతో శ్యామలా దేవిని రెండో వివాహం చేసుకున్నారు. వారికి సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి అనే సంతానం కలిగారు. మొత్తంగా చూసుకుంటే కృష్ణంరాజు అన్ని ఆస్తుల విలువ కలిపి దాదాపు 1000 కోట్ల దాకా ఉంటుందట.

ఇదంతా కేవలం కృష్ణంరాజు తన పూర్వీకుల నుంచి, అలాగే స్వశక్తితో సంపాదించుకున్న ఆస్తి. ఇవి కాకుండా ప్రభాస్, ఆయన తండ్రి ఆస్తులు వేరేగా ఉన్నాయట. ఈ 1,000 కోట్ల రూపాయలలో ముగ్గురు కూతుళ్లకు సమానంగా వాటాలు చెందాలని కృష్ణంరాజు వీలునామా రాసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ప్రభాస్ కు తన తదనంతరం ఒక భవనం వచ్చే విధంగా కూడా ఆయన వీలునామాలో రాశారట.
Also Read: Film Federation Strike: మళ్లీ షూటింగ్స్ బంద్.. సమ్మె నోటీసులు ఇచ్చిన ఫిలిం ఫెడరేషన్!

Also Read: NMBK: గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్.. 14న స్పెషల్ సర్ప్రైజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News