Akkineni Nagarjuna and Sonal Chauhan starrer The Ghost Releasing Trailer released: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తాజాగా తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్‌’. గుంటూరు టాకీస్, ఎల్‌బీడబ్ల్యూ, వెరైటీ లవ్ స్టోరీ, పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాలతో పాపులర్ అయిన డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాను తెరకెక్కించాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ది ఘోస్ట్‌ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘ది ఘోస్ట్‌ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో.. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలలో జోరు పెంచింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పాటలు విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా ‘రిలీజ్‌ ట్రైలర్‌’ను విడుదల చేసింది. ఒక నిమిషం 26 సెకండ్ల నిడివిగల ఈ రిలీజ్‌ ట్రైలర్‌.. 'ఆ.. ఇంతకీ ఎవడాడు' అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. 'డబ్బు, సక్సెస్‌.. సంతోషం కంటే శత్రువులను ఎక్కువ సంపాదిస్తుంది' అనే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.



తన అక్క, ఆమె కూతురిని కాపాడడం కోసం హీరో నాగార్జున చేసే సాహసమే ఈ సినిమా అని రిలీజ్‌ ట్రైలర్‌ను చూస్తే ఇట్టే అర్ధమవుతోంది. ఈ సినిమాలో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నాడు. సోనాల్‌ చౌహాన్‌ కూడా నాగ్ సహోద్యోగిగా నటిస్తున్నారు. యాక్షన్ సీన్స్‌ చాలా బాగుంటాయని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పగా.. రిలీజ్‌ ట్రైలర్‌లో అది కనబడింది. ఈ రిలీజ్‌ ట్రైలర్‌ ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది. 


Also Read: Deepika-Ranveer Divorce: దీపికా-రణ్‌వీర్‌లు విడిపోతున్నారా.. అసలు కారణం అదేనా!


Also Read: పొన్నియన్‌ సెల్వన్‌-1లో.. మహేష్‌ బాబు రిజెక్ట్ చేసిన పాత్ర ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook