The Kashmir Files OTT: ఇటీవల సుపర్ హిట్​ టాక్ తెచ్చుకోవడంతో పాటు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సినిమా ది కశ్మీర్​ ఫైల్స్​. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. థియేటర్లలో రికార్డులు సృష్టించింది. కొవిడ్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా కూడా ఈ సినిమా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది కశ్మీర్​ ఫైల్స్​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ ఓటీటీలో విడుదలవనుంది?


ఈ సినిమా ఓటీటీ రైట్స్​ జీ5 దక్కించుకుంది. ఈ విషయం అధికారిక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్​గా ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్​కు అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే ఎప్పుడు ఈ సినిమా ప్రీమియర్ కానుంది అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు జీ5.


కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి..


దాదాపు 30 ఏళ్ల క్రితం కశ్మీర్​లో పండిట్​లపై జరిగిన దాడులు, ఆ సమయంలో వారు పడిన కష్టాలు, అప్పటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమానే ది కశ్మీర్ ఫైల్స్​. దేశవ్యాప్తంగా ఈ మూవీ సూపర్ హిట్​ టాక్ తెచ్చుకుంది.


ఇక ఈ సినిమాను వివిధ వర్గాలు సపోర్ట్ చేయడంతో థియేటర్లలో భారీ వసూళ్లు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ శ్రేణులు ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మూవీపై వినోద పన్ను కూడా రద్దు చేశారు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా అంటూ.. కశ్మీర్ ఫైల్స్​ను ఆకాశానికెత్తినవారు కూడా ఉన్నారు.


వివేక్ అగ్నిహోత్రీ హిందీ భాషలో తెరకెక్కించిన ఈ మూవీ 2022 మార్చి 11 విడుదలైంది. రూ.15 కోట్ల బడ్జెట్​ (దాదాపు) నిర్మించిన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు వసూలు చేసిందని సిని వర్గాల టాక్​.



ఈ మూవీలో మిథున్​ చక్రవర్తి, అనుపమ్​ కేర్​, దర్శన్​ కుమార్​, పల్లవి జోషీ, చిన్మయ్​ మండ్లేకర్​, ప్రకాశ్​ బెల్వాడీ, పునీ్ ఈసర్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.


ఈ సినిమాను జీ స్టూడియోస్​, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై.. తేజ్​ నారాయణ్​ గర్వాల్​, అభిషేక్​ అగర్వాల్​, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మించారు.


Also read: Narayan Das Narang: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కన్నుమూత...


Also read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ-సమంత సినిమాకు పవన్ కల్యాణ్ మూవీ టైటిల్..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook