Narayan Das Narang: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కన్నుమూత...

Narayan Das Narang: టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 11:16 AM IST
  • నిర్మాత నారాయణదాస్ నారంగ్ కన్నుమూత
  • ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న నారాయణదాస్ నారంగ్
  • నారాయణదాస్ మృతి పట్ల ప్రముఖ సంతాపం
Narayan Das Narang: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కన్నుమూత...

Narayan Das Narang Passes Away: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత,  తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (78) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నారాయణ్ దాస్ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మంగళవారం (ఏప్రిల్ 19) తుది శ్వాస విడిచారు.

నారాయణ్ దాస్ ఏషియన్ మల్టిప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్నారు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో నాగచైతన్య-సాయిపల్లవి నటించిన 'లవ్ స్టోరీ', నాగశౌర్య 'లక్ష్య' సినిమాలను ఆయనే నిర్మించారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా 'ఘోస్ట్', ధనుష్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తున్నారు. నారాయణ దాస్ కె నారంగ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

 

(శేఖర్ కమ్ముల, ధనుష్‌లతో నారాయణ్ దాస్ నారంగ్)

నారాయణ దాస్ నారంగ్‌కు భార్య సునీత నారంగ్, ముగ్గురు పిల్లలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, మోహన నారంగ్ ఉన్నారు. నారాయణ్ దాస్ కె  నారంగ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Also Read: Dalit Boy Assaulted: దళిత విద్యార్థికి అవమానం- మోకాళ్లపై కూర్చోబెట్టి.. పాదాలపై నాలుకతో..!

Also Read: Zodiac Signs Personality: ఆ 3 రాశుల వారు రియల్ లీడర్స్... ధైర్యం, తెగింపులో వారికి సాటి లేదు...   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News