Pareshan movie ott release date: మసూద నటుడు తిరువీర్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'పరేషన్'(Pareshan movie). కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో పావని కరణం హీరోయిన్ గా నటించింది. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బన్నీ అబిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శ్రుతి రియాన్, బుద్దాఖాన్ రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వాసు పెండెం సినిమాటోగ్రఫీ ఇచ్చారు. వాల్టెయిర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీలివ్ దక్కించుకుంది. ఆగస్టు 02 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాను థియేటర్లల్లో మిస్ అయిన వారు ఓటీటీలోకి చూసేందుకు రెడీ అవ్వండి. తెలంగాణ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అడియెన్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటీటీలో ఏ మేరకు రెస్పాన్స్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. 



Also Read: Gandeevadhari Arjuna Teaser: హాలీవుడ్ స్థాయిలో 'గాండీవధారి అర్జున' టీజర్.. యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన వరుణ్..


తిరువీర్ హీరోగా తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ విధంగానే ఈ సినిమాను ఎంటెప్ట్ చేశాడు. ఇటీవల కాలంలో ప్రాంతీయ కథలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎలాంటి పరేషాన్ లేకుండానే ఈ పరేషాన్ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను రానా సమర్పించారు.


Also Read: Tollywood: హిట్ లేక ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ యంగ్ హీరోలు వీరే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook