Sarkaru Vaari Paata: సర్కారు వారిపాటపై కరోనా ప్రభావం?
Tollywood News | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురాం కలిసి సర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టందుకు పూజా కార్యక్రమం జరిగింది. అంతకు ముందే సినిమా యూనిట్ అమెరికాకు వెళ్లి అక్కడ షూటింగ్ కోసం కావాల్సిన లొకేషనల్లు కూడా చెక్ చేసుకుంది.
Prince Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురాం కలిసి సర్కారు వారి పాట ( Sarkaru Vaari Paata ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టందుకు పూజా కార్యక్రమం జరిగింది. అంతకు ముందే సినిమా యూనిట్ అమెరికాకు వెళ్లి అక్కడ షూటింగ్ కోసం కావాల్సిన లొకేషనల్లు కూడా చెక్ చేసుకుంది.
Also Read WhatsApp Mute: ఇక వాట్సాప్ లో వీడియో పంపించే ముందు మ్యూట్ చేయవచ్చు
అయితే అమెరికాలో ఇటీవలే కరోనావైరస్ ( Coronavirus ) సెకండ్ వేవ్ మొదలైంది. దాని ప్రభావం సినిమాపై పడింది. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక అమెరికాలో షూటింగ్ జరిగే అవకాశం లేదు అనిపిస్తోంది.
దాంతో అమెరికాలో షూటింగ్ పోస్ట్ పోన్ చేయాల్సిందే అని తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు ( Mahesh Babu ) నటిస్తోన్న సర్కారు వాటి పాట సినిమా విడుదల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ విషయంలో చాలా జాప్యం జరిగింది. అన్ని అడ్డంకులు జయించి ఇటీవలే చిత్రీకరణ కోసం పూజ కూడా చేశారు. కానీ మళ్లీ ఇలా అమెరికా షెడ్యూల్ వాయిదా పడింది.
Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత?
సినిమా యూనిట్ ముందు ఇప్పుడ రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండియాలో చేయాల్సిన షూటింగ్ షెడ్యూల్ మొత్తాన్ని వెంటనే ప్రారంభించి, అందుబాటులో ఉన్న నటీనటులతో సినిమా పూర్తి చేయడం. లేదా వచ్చే ఏడాదికి వాయిదా వేయడం. మరి ఇందులో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR