Bigg Boss Telugu 4: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 లో బిగ్‌బాస్ దత్త పుత్రికగా పేరు సంపాదించుకున్న మోనాల్‌కు ఈ వారం ఎలిమినేషన్ తప్పదా..ఈ వారం జరగనున్న చివరి ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమెకిక ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. కారణాలివే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ( Bigg boss telugu season 4 )ఫైనల్‌కు ఇంకో వారమే మిగిలింది. ఈ నేపధ్యంలో ఈ వారం జరగబోయేది చివరి ఎలిమినేషన్ ( Elimination ). హౌస్‌లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఒకడైన అఖిల్ ( Akhil ) టికెట్ టు ఫినాలే ( Ticket to finale ) గెల్చుకుని సేవ్ అయ్యాడు. కాగా మోనాల్, సుహైల్, అరియానా, అభిజీత్, హారిక ( Harika )లు  ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఎలిమినేషన్‌కు ఒక రోజు ముందే ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేదెవరనే విషయంపై చర్చ సాగుతోంది. కచ్చితంగా ఈసారి మోనాల్ ( Monal ) ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది.


మోనాల్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్న అవినాష్, మెహబూబ్‌లు ఎలిమినేట్ అవడం, తక్కువ ఓట్లు వచ్చినా  సేవ్ అవుతుండటంతో బిగ్‌బాస్ ( Bigg Boss ) కావాలనే సేవ్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యం బిగ్‌బాస్ తనపై పడ్డ నిందను చెరిపేసేందుకైనా మోనాల్‌ను ఈ వారం ఎలిమినేట్ చేస్తారని కొందరి వాదన. వాస్తవానికి బిగ్‌బాస్  హౌస్ ( Bigg Boss House )‌లో ప్రతి చిన్న విషయానికీ ఏడుపు లంకించుకుని..ప్రేక్షకుల్ని విసిగిస్తుందనే ఆరోపణలు బాగానే వస్తున్నాయి మోనాల్‌పై. 


మోనాల్ విషయంలో ప్రేక్షకుల్ని భారీగా వస్తున్న ట్రోలింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందనేది మెజార్టీ వర్గీయుల అంచనా. బిగ్‌బాస్ ఇక మోనాల్‌కి ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. టాప్ ఫైవ్‌లో విజేత ఎవరనేది వచ్చే వారం తేలిపోతుంది. Also read: Narappa teaser: నారప్ప అభిమానులకు గుడ్ న్యూస్