`తొలిప్రేమ` సినిమా రివ్యూ
వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘తొలి ప్రేమ’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి పవన్ కళ్యాణ్ నటించిన అప్పటి సినిమా టైటిల్ తో రిలీజ్ కి ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో.. తెలుసుకుందాం
నటీ నటులు : వరుణ్ తేజ్ , రాశి ఖన్నా, సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది
మ్యూజిక్ : థమన్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్
నిర్మాత : బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్
కథ – మాటలు -స్క్రీన్ ప్లే -దర్శకత్వం : వెంకీ అట్లూరి
రిలీజ్ డేట్ : 9 ఫిబ్రవరి 2017
వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘తొలి ప్రేమ’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి పవన్ కళ్యాణ్ నటించిన అప్పటి సినిమా టైటిల్ తో రిలీజ్ కి ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ సినిమా ఎలా ఎంటర్టైన్ చేసిందో.. తెలుసుకుందాం.
కథ :
తనకు రైట్ అనిపిస్తే దేన్నైనా ఛాలెంజింగ్ గా తీసుకునే ఆదిత్య శేఖర్(వరుణ్ తేజ్) అనుకోకుండా ఓ రైలు ప్రయాణంలో వర్ష(రాశి ఖన్నా) ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు. ఈ విషయాన్ని అప్పుడే వర్షకి తెలియజేస్తాడు కూడా. తర్వాత వీరిద్దరూ అనుకోకుండా ఒకే కాలేజిలో మళ్ళీ కలుసుకుంటారు. ఈ క్రమంలో వర్ష కూడా ఆదిత్యను ప్రేమిస్తుంది.
దేని గురించైనా ముందు గొడవ పడి తర్వాత ఆలోచించే ఆదిత్య… ఏ విషయం గురించైనా ముందు ఆలోచించాకే నిర్ణయం తీసుకునే వర్ష అనుకోకుండా ఓ గొడవ వల్ల విడిపోతారు. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత లండన్ లో కలుసుకున్న వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారు..అనేది మిగతా కథ.
నటీనటుల పనితీరు :
ఫిదాలో వరుణ్ గా అందరినీ ఎట్రాక్ట్ చేసిన వరుణ్ తేజ్ మరో సారి ఆదిత్య శేఖర్ గా తన మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాడు. హీరోగా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ బెస్ట్ అనిపించుకుంటున్న వరుణ్ తేజ్ డాన్స్ లో కూడా పరవాలేదనిపించుకున్నాడు. ముఖ్యంగా మూడు ఫెజెస్ లో జరిగే లవ్ స్టోరీ కావడంతో మూడు గెటప్స్ లో కనిపిస్తూ ఆ లుక్స్ తో సూపర్బ్ అనిపించుకున్నాడు.
ఈ సినిమాకోసం బరువు తగ్గిన రాశి ఖన్నా వర్ష క్యారెక్టర్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసి సినిమాకు ప్లస్ అయ్యింది. చాలా రోజుల తర్వాత సుహాసిని మరో సారి అమ్మ పాత్రలో ఒదిగిపోయి నటించి ఆకట్టుకుంది. ప్రియదర్శి-హైపర్ ఆది-విధ్యు రామన్, సత్యం రాజేష్ తమ కామెడి టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. కులం గురించి వచ్చే సన్నివేశంలో నరేష్ మరో సారి నటుడిగా మంచి మార్కులు అందుకున్నాడు. మిగతా వారందరూ తమ క్యారెక్టర్స్ తో పరవాలేదనిపించుకున్నారు.
టెక్నిషియన్స్ పనితీరు :
నిజానికి ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరి సినిమాలకు మ్యూజిక్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే.. సినిమాకు పర్ఫెక్ట్ మ్యూజిక్ అందించి మెయిన్ హైలైట్ గా నిలిచాడు తమన్. ముఖ్యంగా హార్ట్ టచింగ్ సీన్స్ లో తన బాగ్రౌండ్ స్కోర్ తో మంచి ఫీల్ కలిగించాడు. ‘నిన్నలా’,’విన్నానే విన్నానే’,’అల్లసాని వారి పద్యమా’,’తొలి ప్రేమ’ సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలకు శ్రీమణి అందించిన సాహిత్యం బాగుంది. తమన్ తర్వాత ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ముందుగా మాట్లాడుకోవాల్సింది జార్జ్ సి.విలియమ్స్ గురించే. తన సినిమాటోగ్రఫీ తో సినిమాకు బిగ్ ఎస్సెట్ గా నిలిచాడు. ప్రతీ ఫ్రేం అందంగా పెయింటింగ్ లా కనిపించింది. ఎడిటింగ్ బాగుంది. వెంకీ అట్లూరి డైలాగ్స్ – స్క్రీన్ ప్లే సినిమాను నిలబెట్టాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
సమీక్ష :
ఫిదా సినిమా తర్వాత వరుణ్ తేజ్ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడనగానే ఈ సినిమాపై అంచనలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అప్పటి క్లాసిక్ సినిమా తొలిప్రేమ టైటిల్ పెట్టడంతో ఆ అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఆ టైటిలే సినిమాపై ఎక్కడలేని హైప్ తీసుకొచ్చింది.మొదటి సినిమాతోనే హీరోగా తానేంటో నిరుపించుకున్న వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభంలో ప్రయోగాలు చేసి ఆ తర్వాత మాస్ సినిమాల వైపు మొగ్గు చూపి అపజయాలు అందుకున్న సంగతి తెలిసిందే .
ఫిదా సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్న వరుణ్ తేజ్ మరోసారి తనకి సూట్ అయ్యే అలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్నే సెలెక్ట్ చేసుకొని మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. ఇక గతంలో ‘స్నేహగీతం’ సినిమాతో హీరోగా పరిచయమైన దర్శకుడు వెంకీ అట్లూరి ఆ తర్వాత ‘కేరింత’ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సంగతి తెలిసిందే.
ఆ రెండు సినిమాల అనుభవంతో తొలిప్రేమను అందంగా తీర్చి దిద్ది తన డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేశాడు. “మైనస్ సెంటిగ్రేడ్ లో ఒకడు చెప్పులు లేకుండా పరిగెడుతూ ఏం చేయలేని స్థితిలో ఉన్నడంటే వాడు రెండు విషయాల్లో ఫెయిల్ అయ్యి ఉంటాడు అందులో ఒకటి కెరీర్, మరొకటి లవ్.. కెరీర్ లో నేను టాప్ ప్లేస్ లో ఉన్నాను. కాని ప్రేమలోనే ఎక్కడున్నానో తెలియడం లేదు.” అంటూ ఆదిత్య శేఖర్ పాయింట్ ఆఫ్ యు లో కథ స్టార్ట్ చేసిన దర్శకుడు వెంకీ ఆ మేజిక్ ని చివరి వరకూ కంటిన్యూ చేస్తూ ఎంటర్టైన్ చేశాడు.
ఇలా కొన్ని సందర్భాల్లో వచ్చే హార్ట్ టచింగ్ సీన్స్ చూస్తే వెంకీ కి దర్శకుడిగా మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. ముఖ్యంగా ‘తొలి ప్రేమ’ లాంటి టైటిల్ పెట్టుకొని ఫాన్స్ లో ఎక్కడా నిరుత్సాహ పరచకుండా ఆ టైటిల్ కున్న గౌరవాన్ని తగ్గించకుండా బాగా డీల్ చేశాడు వెంకి. ఆ ఫ్లేవర్ మిస్ థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. రిలీజ్ కి ముందే సాంగ్స్ తో సినిమాపై మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన థమన్ సినిమాకు పర్ఫెక్ట్ అనిపించే బాగ్రౌండ్ స్కోర్ అందించి మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. వరుణ్ తేజ్-రాశి ఖన్నా కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యింది. వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ ని బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.
వరుణ్ తేజ్ -రాశి ఖన్నా కెమిస్ట్రీ, వీరి మధ్య వచ్చే ఎమోషనల్-రొమాంటిక్ సీన్స్, సాంగ్స్, బాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, సాంగ్స్ పిక్చరైజేషన్,స్విచ్చువేషన్ కి తగ్గట్టు వచ్చే కామెడీ, లవ్ ట్రాక్, యూత్ ని ఎట్రాక్ట్ చేసే కొన్ని సీన్స్, ఎమోషనల్ డైలాగ్స్, ప్రీ ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. స్లో నేరేషన్, సెకండ్ హాఫ్ కాస్త డ్రాగ్ అనిపించడం సినిమాకు మైనస్.
ఓవరాల్ గా ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ‘తొలి ప్రేమ’ యూత్ కి బాగా ఎంటర్టైన్ చేస్తుంది.
రేటింగ్ : 3 / 5
(జీ సినిమాలు వెబ్‌సైట్ సౌజన్యంతో)